నాని, కీర్తి సురేష్‌ హ్యాట్రిక్ కొడతారా ..?

కొన్ని కాంబినేషన్స్ భలే ఉంటాయి. అందుకే మేకర్స్ కూడా వారిని రిపీట్ చేస్తుంటారు. ఇక వీరు డిఫరెంట్ స్టోరీస్ ను పిక్ చేసుకునేవారైతే ఆడియన్స్ కూడా ఆ కాంబినేన్స్ కోసం ఆసక్తిగా చూస్తారు. టాలీవుడ్ లో అలాంటి కాంబోలో ఒకటి నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ ది అని చెప్పొచ్చు. ఫస్ట్ మూవీగా ఈ కాంబోలో వచ్చిన నేను లోకల్ సూపర్ హిట్ అయింది. అప్పటి నాని ఇమేజ్ కు భిన్నంగా ఉన్నా.. ఎంటర్టైన్మెంట్ తో కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలిచింది. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి దసరా మూవీతో వస్తున్నారు. కంప్లీట్ డిఫరెంట్ మేకోవర్ తో కనిపిస్తోన్న ఈ కపుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టారు. మరి ఆ కొత్త సినిమా ఏంటో చూద్దాం.


నేచురల్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్నాడు నితిన్. అంతే నేచురల్ యాక్ట్రస్ గా కీర్తి సురేష్‌ కూ పేరుంది. పైగా అమ్మడు నేషనల్ అవార్డ్ విన్నర్. కొన్నాళ్ల క్రితం వరకూ గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉన్నా.. సర్కారువారి పాటతో బబ్లీ గాళ్ గానూ కనిపించగలను అని ప్రూవ్ చేసుకుంది. ఈ మూవీతో హిట్ అందుకుంది కూడా. ప్రస్తుతం తెలుగులో నాని సరసనే దసరా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఇద్దరివీ పూర్తిగా డీ గ్లామర్ రోల్స్ కావడం విశేషం. ఆ మధ్య వచ్చిన నాని పాట, కీర్తి ఫస్ట్ లుక్ కు ఆడియన్స్ సర్ ప్రైజ్ అయిపోయారు. చిరంజీవి చెల్లి పాత్రలో భోళా శంకర్ లోనూ నటిస్తోంది కీర్తి సురేష్‌. ఇవి కాక మరో రెండు తమిళ సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి.

అయితే లేటెస్ట్ గా మరోసారి నానితో నటించేందుకు ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా నాని ఓ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ఈ అనౌన్స్ మెంట్ టీజర్ లో తను ఓ చిన్న పాపతో మాట్లాడిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అందులో ఆ పాప కొత్త సినిమాలో ఈ దసరా మూవీ గడ్డం వద్దు అని చెప్పడం ఆకట్టుకుంది. అయితే ఆ లుక్ తో పాటు తన హీరోయిన్ ను కూడా రివీల్ చేస్తూ నాని పెట్టిన ఓ ఫోటో వైరల్ అవుతుంది. హెయిర్ స్టైల్ దసరా నుంచి పెద్దగా మారకపోయినా పూర్తిగా గడ్డం, మీసాలు లేకుండా యూత్ ఫుల్ లుక్ తో కనిపిస్తున్నాడు నాని. అదే ఫోటోలో తనతో పాటు ట్రెడిషనల్ లుక్ లో కీర్తి సురేష్‌ కూడా ఉంది. నాని కెరీర్ లోనే అత్యంత భారీ ఖర్చుగా 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. మరి ఈ రెండు సినిమాలతో ఈ క్రేజీ కపుల్ హ్యాట్రిక్ కొడతారా లేదా అనేది చూడాలి.

Related Posts