HomeLatestMalli pelli : మహేష్‌ బాబు జపం మళ్లీ పెళ్లికి కలిసొచ్చేనా.. ?

Malli pelli : మహేష్‌ బాబు జపం మళ్లీ పెళ్లికి కలిసొచ్చేనా.. ?

-

మళ్లీ పెళ్లి.. టైటిల్ తోనే ఆకట్టుకున్నాడు నరేష్‌. పవిత్రతో తన ప్రేమ, పెళ్లి వ్యవహారం గురించి మీడియాతో పాటు సోషల్ మీడియాస్ లో వస్తోన్న అనేక ప్రశ్నలకు ఈ సినిమాతో సమాధానం చెప్పబోతున్నానని చెప్పకనే చెప్పాడు.

ఈ చిత్రాన్ని తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో మెమరబుల్ మూవీస్ అందించిన విజయ కృష్ణ బ్యానర్ లో నిర్మించడం విశేషం. ఈ బ్యానర్ లో చాలాకాలం తర్వాత వస్తోన్న చిత్రం కూడా ఇదే. మాజీ నిర్మాత నుంచి దర్శకుడుగా మారిన ఎమ్మెస్ రాజు ఈ చిత్రానికి దర్శకుడు. ఆ మధ్య విడుదల చేసిన ట్రైలర్ తో బానే ఆకట్టుకున్నారు.

కొంతమంది సెలబ్రిటీస్ కు స్పెషల్ స్క్రీనింగ్ వేసి అందరి చేతా ఆహా ఓహో అనిపించారు కానీ.. ఆడియన్స్ ను అట్రాక్ట్‌ చేయడానికి అది సరిపోదు. అందుకే ఈ జంట ఇక మహేష్‌ బాబు జపం మొదలుపెట్టారు.


తమ పెళ్లి మహేష్‌ బాబుకు ఇష్టమే అని.. ఇద్దరూ చాలా బావున్నారు.. బావుండండి అన్నాడు అని.. ఈ మూవీమంచి విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడనీ .. చెబుతూనే.. మహేష్‌ ఫ్యాన్స్ కు మా మళ్లీ పెళ్లి మరింతగా నచ్చుతుందని చెబుతున్నారు.

ఈ నెల 26న విడుదల కాబోతోన్న మళ్లీపెళ్లిపై ఇప్పటికైతే ఏ అంచనాలూ లేవు. ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం సినిమా కోసం చూస్తున్నారు అనుకోవచ్చు. అయితే నరేష్‌ మాత్రం తామో క్లాసిక్ తీశాం అనే కాన్ఫిడెన్స్ తో కనిపిస్తుండటం విశేషం. మరి కాన్ఫిడెన్స్ కాసులు తెస్తుందా లేదా అనేది చెప్పలేం కానీ.. ఈ మూవీ కోసం జంటగా వీళ్లు చేస్తోన్న ప్రమోషన్స్ మాత్రం ముచ్చటేస్తున్నాయనే చెప్పాలి. ఓ కొత్త హీరో హీరోయిన్ కలిసి తమ చిత్రాన్ని ప్రమోట్ చేసుకుంటున్నంత శ్రద్ధగా మళ్లీ పెళ్లిని ప్రమోట్ చేస్తున్నారు.

ఇవీ చదవండి

English News