SSMB28 : మహేష్‌ బాబు గుంటూరు కారం.. బీడీ త్రీడీలో కనబడుతుందా..?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రానికి ”గుంటూరు కారం” అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. అయితే దీనికి పెట్టిన ట్యాగ్ లైన్ మాత్రం అదిరిపోయింది. హైలీ ఇన్ ఫ్లామబుల్ అనేది క్యాప్షన్. అంటే భారీ విస్ఫోటనకారి అని అర్థం. చెప్పినట్టుగానే అద్భుతమైన వీడియో గ్లింప్స్ కూడా విడుదల చేసింది మూవీ టీమ్.

సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా వచ్చిన ఈ గ్లింప్స్.. ఫ్యాన్స్ ఊహించినదాని కంటే ఎక్కువగానే కనిపిస్తోంది. అల వైకుంఠపురములో క్లైమాక్స్ ఫైట్ ను తలపించేలా ఓ పాటతో మొదలుపెట్టాడు త్రివిక్రమ్. దీనికి తమన్ నేపథ్య సంగీతం గూస్ బంప్స్ తెప్పిస్తుంటే.. ” సన్న కర్రా సవ్వా దెబ్బా.. బొడ్డు రాయి బేటా దెబ్బా.. రవణ దెబ్బా దవడ అబ్బా వుయ్ .. “ అంటూ మాసివ్ గా బ్యాక్ గ్రౌండ్ వినిపిస్తోంటే మహేష్‌ బాబు ఫైట్ సీన్ కు రెండు కళ్లూ చాలవు అన్నట్టుగా ఉంది.

”హే సర్రా సర్రా శూలం..సుర్రంటుంది కారం.. ఎడాపెడా సూడం.. ఇది ఎర్రెత్తించే బేరం.. ” ఇదీ పాట.
పాట అయిన వెంటనే నోట్లోంచి బీడీ తీసి వెలిగిస్తూ.. ” ఏంది అట్టా జూస్తన్నావ్.. బీడీ త్రీడీలో కనపడతందా.. ” అంటూ మహేష్‌ చెప్పిన డైలాగ్ మైండ్ బ్లోయింగ్. మొత్తంగా ఈ ఎపిసోడ్ అంతా మిర్చి యార్డ్ లోనే కనిపిస్తోంది. దీంతో ఇది గుంటూర్ మిర్చి యార్డ్ నేపథ్యంలో సాగే కథగా ఓ క్లారిటీ వచ్చేసింది.

మరి గుంటూరు మిర్చి అంటే ప్రపంచ వ్యాప్తంగా ఓ పేరుంది. అలాంటి గుంటూర్ యార్డ్ లో మిర్చి యాపారం చేస్తూ అక్కడి దళారుల దుమ్మురేపే హీరోగా మహేష్‌ బాబు కనిపించే అవకాశం ఉంది అనుకోవచ్చు.


ఇక వచ్చే సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12న విడుదల కాబోతోన్న ఈ మూవీలో సూపర్ స్టార్ సరసన పూజాహెడ్గే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తంగా నాన్నగారికి జయంతి సందర్భంగా తమ నేటివ్ డిస్ట్రిక్ట్ అయిన గుంటూర్ నుంచి భారీ విస్ఫోటనం లాంటి గ్లింప్స్ విడుదల చేశారు అనే చెప్పాలి.

Related Posts