ఇండియాస్ టాప్ స్టార్ అని ఓ వైపు ఫ్యాన్స్ అంతా చంకలు గుద్దుకుంటుంటే.. ఇండియాస్ సంగతి అటుంచితే అసలు టాప్ టెన్ లో కూడా లేకుండా పోయాడు ప్రభాస్. రీసెంట్ గా ఐఎమ్.డి.బి అనే వెబ్ సైట్ ఈ యేడాదికి ఇండియాలో టాప్ స్టార్స్ ఎవరూ అని నిర్వహించిన సర్వేలో ప్రభాస్ లేడు. యస్.. ఇప్పటి వరకూ ప్యాన్ ఇండియన్ స్టార్ అనీ.. కాబోయే గ్లోబల్ స్టార్ అని చెప్పుకుంటోన్న ప్రభాస్ అసలు టాప్ టెన్ లోనే లేకుండా పోవడం వింతగా ఉందంటున్నారు ఫ్యాన్స్.


ఇక ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో నిలిని హీరో ధనుష్‌ కావడం విశేషం. ధనుష్‌ కు దేశవ్యాప్తంగా మంచి అభిమానులున్నారు. అతని స్టోరీ సెలక్షన్ కు సెపరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అతను నెంబర్ వన్. తర్వాతి ప్లేస్ లో అలియాభట్ ఉంది. తను ఈ యేడాది ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర, డార్లింగ్స్ అనే మూడు సినిమాలు చేసింది. మూడూ విజయం సాధించాయి. థర్ద్ ప్లేస్ లో పొన్నియన్ సెల్వన్ 1లో ఓ కీలక పాత్ర చేసిన ఐశ్వర్య రాయ్ నిలిచింది. నాలుగో స్థానం ఆర్ఆర్ఆర్ స్టార్ రామ్ చరణ్‌ గెలిచాడు.

ఈ మూవీతో చరణ్‌ కు దేశవ్యాప్తంగా ఎవరూ ఊహించనంత క్రేజ్ వచ్చింది. ఐదో స్థానంలో సమంత నిలవడం విశేషం. తను డివోర్స్ టాపిక్ తో హాట్ హాట్ గా నిలిచిందీ యేడాది. రీసెంట్ గా యశోద మూవీతో విమర్శకులను మెప్పించింది.


అయితే ఆరో స్థానంలో విక్రమ్ వేద వంటి డిజాస్టర్ చూసిన హృతిక్ రోషన్ అందుకోవడం ఆశ్చర్యం. అతని ఛరిష్మా ఎప్పుడో మిస్ అయింది. ఏడో స్థానంలో కియారా అద్వానీ నిలిచింది. తను ఈ యేడాది రెండు సినిమాలతో హిట్ అందుకుంది. ఎనిమిదో స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలిచాడు. ఆర్ఆర్ఆర్ లో నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విమర్శకులను మెప్పించినందుకు ఈ స్థానం అనుకోవచ్చా..? ఎన్టీఆర్ తర్వాత పుష్ప స్టార్ అల్లు అర్జున్ ఉన్నాడు. అంటే తొమ్మిదో స్థానం అన్నమాట. పదో ప్లేస్ కెజీఎఫ్‌ స్టార్ యశ్ ఉన్నాడు. అంతే.


ఈ లిస్ట్ లో ప్రభాస్ లేకపోవడం మోసమా లేక.. అసలు అతన్ని పరిగణలోకి తీసుకోకుండా సర్వే చేశారా అనే అనుమానాలు అక్కర్లేదు. నిజంగానే అతనికి ఓట్లు పడలేదు అనుకోవచ్చు. లేదంటే హృతిక్ రోషన్, సమంత, కియారా కంటే కూడా తీసిపోయాడా.. పైగా ఈ యేడాది రాధేశ్యామ్ అనే సినిమాతోనూ వచ్చాడు ప్రభాస్. ఏదేమైనా ఈ లిస్ట్ లో ప్రభాస్ లేకపోవడాన్ని అవమానంగానే భావిస్తున్నారు ఆయన ఫ్యాన్స్.