విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) – సమంత(Samantha) జంటగా నటిస్తోన్న సినిమా ఖుషీ. ఈ టైటిల్ అనౌన్స్ అయిన దగ్గర నుంచీ సినిమాపై అందర్లోనూ ఓ ఆసక్తి ఉంది.
పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్ కావడం ఒకటైతే.. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సమంత(Samantha) కలిసి నటిస్తుండటం మరో కారణంగా ఉంది. సెన్సిబుల్ మూవీ మేకర్ గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ(Shiva Nirvana) డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ సమంత అనారోగ్యం కారణంగా కాస్త ఆలస్యమైంది.
అయినా ది బెస్ట్ అవుట్ పుట్ తోనే వస్తున్నామని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు మేకర్స్. ఇక లేటెస్ట్ గా కేరళలో జరిగిన షెడ్యూల్ తో విజయ్ దేవరకొండకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఈ మూవీకి సంబంధించి ఇక అతనుషూటింగ్ కు రానవసరం లేదు. అయితే ఖుషీ(Khushi) మూవీ కథ ఇదేనంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటిని చూస్తే 90ల్లో మణిరత్నం(Maniratnam) తీసిన దిల్ సే(Dil Se) మూవీ గుర్తొస్తుంది.
ఖుషీ(Khushi) మూవీ కశ్మీర్(Kashmir) ప్రాంతంలో జరిగే కథ. హీరోయిన్ అక్కడికి చెందిన యువతే. ఓ ప్రాజెక్ట్ వర్క్ మీద కశ్మీర్ వెళతాడు హీరో. అక్కడ హీరోయిన్ ను చూసి ప్రేమలో పడతాడు. కానీ తను అతన్ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. తనేమో పట్టువదలని విక్రమార్కుడులా ఆమె కోసం ప్రయత్నాలు చేస్తూ తిరిగి హైదరాబాద్ కు రాకుండా అక్కడే ఉంటాడు.
ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. కానీ తన నేపథ్యం వేరే. కశ్మీర్ వేర్పాటు వాద ఉద్యమానికి సంబంధించిన వ్యక్తి ఆమె. ఆ నేపథ్యం తెలిస్తే అతను తనను వదిలి వెళతాడు కాబట్టే.. ప్రేమించినా దూరం పెడుతూ ఉంటుంది. కానీ అతను ఆమె ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతాడు. ఆ క్రమంలో ఆమె నేపథ్యం వల్లే చివరికి ఇద్దరూ అనుకోకుడా చనిపోతారు. అంటే శాడ్ ఎండింగ్ అన్నమాట.
మరి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) – సమంత(Samantha) లాంటి క్రేజీ పెయిర్ తో సినిమా విషాదాంతం అయితే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో కానీ.. ప్రస్తుతానికి ఖుషీ(Khushi) మూవీ కథ ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది.
అయితే షారుఖ్ ఖాన్(Sharukh Khan), మనీషా కోయిరాలా(Manisha Koirala) జంటగా మణిరత్నం తీసిన దిల్ సే(Dil Se) కథ దాదాపు ఇదే. అదీ కశ్మీర్ లో ప్రేమకథ మొదలై.. ముంబై(Mumbai)కి చేరి ఢిల్లీ(Delhi)లో ముగుస్తుంది. అందులో హీరోయిన్ కూడా తిరుగుబాటు దళానికి చెందిన వ్యక్తే. ప్రేమించినా చెప్పలేని పరిస్థితిలో ఉంటుంది. మరి ఖుషీ కథ ఇదేనా కాదా అనేది తెలియదు కానీ.. ఆ నేపథ్యంలో కాస్త జాగ్రత్తగా రాసుకుని తీస్తే ఖచ్చితంగా ఇప్పుడు కూడా వర్కవుట్ అవుతుంది.