చైతన్య, సమంత ఇద్దరి మధ్య ఏం జరిగింది.? ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమేనా.?
Latest Movies Social Media Tollywood

చైతన్య, సమంత ఇద్దరి మధ్య ఏం జరిగింది.? ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమేనా.?

అక్కినేని నాగచైతన్య, సమంత.. వీరిద్దరూ ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అయితే.. ఏమైందో ఏమో కానీ.. నాగచైతన్య, సమంత విడిపోతున్నారని.. గత కొన్ని రోజులుగా మీడియాలోను, సోషల్ మీడియాలోను వార్తలు వస్తున్నాయి. సమంత తన ట్విట్టర్ అకౌంట్ లో అక్కినేని అనే పేరునే తీసేయడంతో ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమేనా అనే అనుమానాలు బలపడ్డాయి. వీరి గురించి సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్న ఇటు చైతన్య కానీ.. అటు సమంత కానీ స్పందించకపోవడంతో అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో అని అభిమానులు సైతం ఆలోచనలో పడ్డారు.

నిన్న లవ్ స్టోరీ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ కు అనుహ్యమైన స్పందన లభించింది. అయితే… సమంత సాయిపల్లవికి ట్యాగ్ చేస్తూ.. లవ్ స్టోరీ మూవీ గురించి స్పందిస్తూ విన్నర్ అంటూ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పింది కానీ.. నాగచైతన్య గురించి ఎలాంటి కామెంట్ పెట్టలేదు. అలాగే నాగచైతన్య నిన్న రాత్రి లవ్ స్టోరీ ట్రైలర్ గురించి ట్వీట్ చేసిన కొందరికి థ్యాంక్స్ చెప్పాడు. ఇంతకీ ఎవరెవరికీ చైతన్య థ్యాంక్స్ చెప్పారంటే… నాన్న నాగార్జున, కజిన్ సుశాంత్, దేవ కట్టా, రైటర్ బివిఎస్ రవి, నీరజ కోన, నాగశౌర్యలకు థ్యాంక్స్ చెప్పాడు కానీ.. సమంత చేసిన ట్వీట్ గురించి కామెంట్ చేయలేదు.

దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు.. విడాకులు.. కరెక్ట్ అనుకున్నారు చాలా మంది. అయితే.. రాత్రి ఏమైందో ఏమో కానీ.. చైతన్య ఈ రోజు ఉదయం సమంత ట్వీట్ కు సమాధానంగా థ్యాంక్స్ సామ్ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో అభిమానులకు కాస్త ఊరట కలిగింది. అయితే.. అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. చైతన్య హైదరాబాద్ లో సింగిల్ గా ఉంటున్నారని.. సమంత చెన్నైలో ఉంటుందని టాక్ బలంగా వినిపిస్తుంది. అయితే.. లవ్ స్టోరీ ప్రమోషన్స్ కోసం చైతన్య వారం రోజుల్లో మీడియా ముందుకు రానున్నారు. అప్పుడు ఈ విడాకుల వ్యవహారం పై ఓ క్లారిటీ వస్తుందని చెప్పచ్చు.

Post Comment