వామ్మో.. ప్రభాస్ ఈ దూకుడేంది బాసూ..

మనకు బాగా తెలిసిన హీరో పాత్ర ఏదైనా సినిమాలో సడెన్ గా మారితే.. ఆశ్చరోపోతాం. ఆ మార్పు ఏ మాత్రం ఊహించనిది అయితే షాక్ అవుతారు కూడా. ప్రస్తుతం తెలుగుతో పాటు ఇండియన్ ఆడియన్స్ కు అలాంటి షాకులే ఇస్తున్నాడు ప్రభాస్. లేదంటే ఈ దూకుడు ఏంటీ సామీ అనేలా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ మూవీస్ కు సంబంధించిన లైనప్ చూస్తే అతని ప్లాన్ ఏంటో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. రీఎంట్ గానే సిద్ధార్థ్ ఆనంద్ తో మూవీ కన్ఫార్మ్ అయింది. ఇక లేటెస్ట్ గా మరో ప్రాజెక్ట్ ఓకే అయింది. ఇందులో డార్లింగ్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడట. మరి ఈ బాహుబలి మూవీస్ లైనప్ ఎలా ఉందో చూద్దాం..


డార్లింగ్ స్టార్ ప్రభాస్ దూకుడుకు ఎంటైర్ ఇండియన్ ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఇతర హీరోలైతే అసలేం జరుగుతుందా అని ఆరాలు తీస్తున్నారు. మొన్నటి వరకూ ఒక్కో సినిమాకు చాలా టైమ్ తీసుకున్న ప్రభాస్ ఇక నాన్ స్టాప్అన్నట్టుగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మరోవైపు సలార్ చివరి స్టేజ్ లో ఉంది. ఈ రెండు సినిమాలూ ఈ 2023లోనే విడుదలవుతాయని ఆల్రెడీ రిలీజ్ డేట్స్ కూడా చెప్పారు కదా..? ఇక మారుతితో చేస్తోన్న రాజా డీలక్స్ సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. అన్నీ కుదిరితే ఈ మూవీ కూడా ఈ యేడాదే వస్తుందని చెబుతున్నారు. అంటే 2023లో దాదాపు తీన్మార్ గ్యారెంటీ.

ఇక నెక్ట్స్ ఇయర్ వరకూ ప్రాజెక్ట్ కే కు సంబంధించి తన షూటింగ్ పూర్తవుతుంది. ఇంకా చెబితే ఈ యేడాది దసరా వరకూ ప్రాజెక్ట్ కే షూటింగ్ ఫినిష్ అవుతుంది. అప్పటి నుంచి ప్రభాస్ డేట్స్ స్టార్ట్అవుతాయి. ఆ డేట్స్ ను ఆల్రెడీ సిద్ధార్థ్ ఆనంద్ సినిమాకే కేటాయించాడు అన్నారు. మైత్రీ మూవీస్ నిర్మించే సినిమా. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోందీ చిత్రం. పైగా మల్టీస్టారర్ అని కూడా అంటున్నారు. ఇక లేటెస్ట్ గా కొన్నాళ్ల క్రితం అనౌన్స్ అయిన మూవీ కూడా లైమ్ లైట్ లోకి వచ్చింది. అర్జున్ రెడ్డితో తెలుగు సినిమాను మళ్లీ కుదిపేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ మూవీ ఉంటుందని గతంలోనే చెప్పారు.

ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ కూడా అనుకున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి బాలీవుడ్ లోనే రణ్‌బీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ పూర్తి చేసి ఈ యేడాది చివరి వరకూ విడుదల చేస్తారు. సో.. ఇక ప్రభాస్ తో కొత్త కథ మొదలుపెడతాడు సందీప్. ఆల్రెడీ ప్రభాస్ మూవీ స్పిరిట్ స్క్రిప్ట్ కూడా పూర్తయిపోంది అంటున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడట. ఈ విషయాన్ని రీసెంట్ గా నిర్మాత భూషణ్ కుమార్ చెప్పాడు. విశేషం ఏంటంటే ఈ చిత్రానికి సందీప్ రెడ్డి కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. మొత్తంగా 2023 నుంచి వచ్చే రెండేళ్లలో ప్రభాస్ నుంచి ఆరు సినిమాలు విడుదలవుతాయన్నమాట. మరి ఈ దూకుడును మ్యాచ్ చేసే హీరో ఇప్పుడు ఇండియాలో ఉన్నాడంటే ఖచ్చితంగా లేడనే చెప్పాలి.

Related Posts