వజాహత్‌ మీర్జా  బ్రాండ్‌ తమ స్ర్పింగ్‌ /సమ్మర్‌ 2023 కలెక్షన్‌ను లండన్‌ ఫ్యాషన్‌ వీక్‌ వద్ద విడుదల చేసింది. ‘లిలిబెట్‌’ శీర్షికన విడుదల చేసిన  ఈ కలెక్షన్‌ను  బ్రిటన్‌ మహరాణికి అంకితమిచ్చింది.సెప్టెంబర్‌ 23, 2022 న క్లీన్‌ ఎలిజబెత్‌కు తన కలెక్షన్‌ ‘లిలిబెట్‌’ను భగవంతునికి నివేదనగా సమర్పించింది.లిలిబిట్‌ అనేది ఓ బాలిక పేరు. ‘ప్లెజ్డ్‌ టు గాడ్‌’ అని అర్థం. ఎలిజిబెత్‌ మహారాణి చిన్నతనంలో ఆమె నిక్‌నేమ్‌ అది . ఇప్పుడు అదే పేరును ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ల కుమార్తెకు పెట్టారు.

కొటూరు ఇండియన్‌ ఫ్యాషన్‌కు ప్రతిరూపంగా వజాహత్‌ మీర్జా  వెలుగొందుతుండటమే కాదు,  విదేశీ వేదికలపై అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశీయ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌లో ఒకటిగా ఖ్యాతి గడించింది.లండన్‌ షోను  విజాహత్‌ మీర్జా  ఫ్యాషన్‌ హౌస్‌  ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ విజారత్‌ బేగ్‌ క్యూరేట్‌ చేయడంతో పాటుగా నిర్వహించారు.ఈ మొత్తం కలెక్షన్‌ బ్లాక్‌, గోల్డ్‌ కలర్‌  చుట్టూ తిరుగుతుంటుంది. ఇక్కడ  బ్లాక్‌ కలర్‌ , మహారాణి మహాభినిష్క్రమణకు ప్రతిరూపంగా ఉంటే, గోల్డ్‌ కలర్‌ రాజరికపు వైభవానికి ప్రతిరూపంగా ఉంటుంది. ఈ కలెక్షన్‌ కోసం అతను విభిన్నమైన వస్త్రాలైనటువంటి సిల్క్‌,జార్జెట్‌,  క్రేప్స్‌, వెల్వెట్‌తో  పాటుగా ఫ్యాబ్రిక్‌ ఫ్లీటింగ్‌, అత్యంత జఠిలమైన ఎంబ్రాయిడరీని మహారాణి యొక్క వస్త్రాలలో వినియోగించే ముత్యాలు, బీడ్స్‌, స్వర్వోస్కీ క్రిస్టల్స్‌ వినియోగించి తయారుచేశారు.

ఈ కొటూర్‌ కలెక్షన్‌లో ప్రధానంగా  ఫుల్‌ లెంగ్త్‌, నీ లెంగ్త్‌ గౌన్లు ఉంటాయి. విభిన్న సందర్భాలలో  మహారాణి ధరించిన రీతిలో ఇవి ఉంటాయి.  టైలర్డ్‌ కేప్స్‌ నుంచి పఫ్డ్‌ స్లీవ్స్‌ వరకూ  వీటిని ప్రధానంగా ఈవెనింగ్‌ వేర్‌గా రూపొందించారు కానీ అత్యంత ఆకర్షణీయంగా పగటిపూట కూడా ధరించవచ్చు.మహారాణి శకం ముగిసి నూతన మహారాజు చక్రవర్తిగా బాధ్యతలు స్వీకరించిన వేళ  నూతన ఆశతో ఈ సంవత్సరం కలెక్షన్‌ను భౌతికంగా, డిజిటల్‌గా ప్రదర్శిస్తున్నారు.