స్టైలిష్ పోస్టర్ తో వచ్చిన విఎన్ఆర్ ట్రియో

ఒక్క హిట్ పడితే వరుసగా ఫ్లాపులు చూసే ఏకైక టాలీవుడ్ హీరో నితిన్. ఆ మధ్య భీష్మతో హిట్ అందుకున్నాడు అనుకుంటే ఆ తర్వాత రంగ్ దే, చెక్, మాచర్ల నియోజకవర్గంతో పాటు ఓటిటిలో వచ్చిన మేస్ట్రో వరకూ అన్నీ డిజాస్టర్లే. పైగా తన ఇమేజ్ ను దాటి ఇకపై లవ్ స్టోరీస్ చేయను అని కూడా చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన ఈ మాస్ మూవీస్ అన్నీ దెబ్బకొట్టాయి.

ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే రీసెంట్ గా భీష్మ దర్శకుడు వెంకీ కుడుములతో మరో సినిమా ఓపెన్ అయింది. భీష్మలోనూ హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్నా మరోసారి ఈ టీమ్ తో జాయిన్ అయింది. ప్రస్తుతం విఎన్ఆర్ ట్రియో అనే వర్కింగ్ టైటిల్ తో సాగుతోన్న ఈ మూవీ నుంచి శ్రీ రామ నవమి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. విఎన్ఆర్ అంటే తెలుసు కదా.. వి అంటే దర్శకుడు వెంకీ, ఎన్ అంటే నితిన్, ఆర్ అంటే రష్మిక మందన్నా.


విఎన్ఆర్ ట్రియో మూవీ ఫస్ట్ లుక్ ఆల్ట్రా స్టైలిష్ గా ఉంది. నితిన్ షాడో ఇమేజ్ ను చూపిస్తున్నా.. అతనో పెద్ద బిల్డింగ్ ను ఎక్కుతున్నట్టుగా కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. వీటిని చూస్తే అన్నీ విదేశీ లొకేషన్స్ అనేది అర్థం అవుతుంది. అదే టైమ్ లో నితిన్ గతంలో చేసిన లై సినిమాను కూడా గుర్తుకు తెస్తోంది. లై ఫ్లాప్ అయినా.. అతని అభిమానులకు నచ్చింది. బట్ ఈ సారి కేవలం ఒక వర్గాన్ని మెప్పిస్తే కుదరదు. ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్టేజ్ లో ఉన్నాడు.

కాకపోతే దీనికంటే ముందు వంక్కంతం వంశీ సినిమా వస్తుంది. ఆ రిజల్ట్ ఖచ్చితంగా ఈ మూవీపై ఎఫెక్ట్ చూపిస్తుంది. మొత్తంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తమిళ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకడైన జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఏదేమైనా నితిన్ లుక్ మాత్రం చాలా స్టైలిష్ గానే ఉందని చెప్పాలి.

Related Posts