ఎన్టీఆర్, అల్లు అర్జున్ రూట్ లో విజయ్ దేవరకొండ

ఇప్పుడు తెలుగు హీరోల్లో డైలాగ్స్ ను పర్ఫెక్ట్ చెప్పలేని వాళ్లు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారనే చెబుతాం. అలాంటి హీరోలు ఇతర స్లాంగ్స్ కూడా చెప్పాల్సి వస్తే ఎంత ఇబ్బంది అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక అచ్చ తెలంగాణ స్లాంగ్ తో పెళ్లి చూపులు హీరోగా తెలుగు ప్రేక్షకులను మెప్పించి వరుసగా అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్స్ తో ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే గీత గోవిందంలో ఆంధ్ర స్లాంగ్ పలికేందుకు ఇబ్బంది పడ్డాడు. అందుకే ఈ సారి ఓ కొత్త స్లాంగ్ నేర్చుకునేందుకు ట్యూషన్ పెట్టించుకున్నాడు. ఈ ట్యూటర్ గతంలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకే పాఠాలు చెప్పాడు. మరి విజయ్ కి ట్యూషన్ చెప్పేది ఎవరో తెలుసా..?


వరుసగా ఎన్ని ఫ్లాపులు వచ్చినా విజయ్ దేవరకొండ క్రేజ్ తగ్గలేదు అనేది నిజం. కాకపోతే ఇకపై అతను తగ్గాల్సి ఉంటుంది. లైగర్ తో ఎక్కువ డామేజ్ జరిగినా.. దాన్ని కవర్ చేసుకునేందుకు ఇప్పుడు సరికొత్త కంటెంట్ తో రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే సరికొత్త పాత్రలు చేస్తున్నప్పుడు కొత్త ఛాలెంజ్ లు కూడా ఉంటాయి. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీలో అతను పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

తను ఇప్పటి వరకూ చేసిన క్యారెక్టర్స్ అన్నీ దాదాపు ఒకే తరహా యారగెన్సీతో ఉన్నాయి. ఫస్ట్ టైమ్ డిఫరెంట్ రోల్ కు ఓకే చెప్పాడు. అయితే ఈ కథను ముందు రామ్ చరణ్‌ కు చెప్పాడు దర్శకుడు గౌతమ్. బట్ ఆర్ఆర్ఆర్ లో కూడా అదే పాత్ర చేయడం వల్ల నో చెప్పాడు చరణ్‌. అలా ఈ క్యారెక్టర్ విజయ్ దేవరకొండకు వచ్చింది. అయితే ఈ పాత్ర చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడుతుందట.

మరి మనకు చిత్తూరు స్లాంగ్ అనగానే ఎవరు గుర్తొస్తారు..? యస్.. పెంచల దాస్. నాని కృష్ణార్జున యుద్ధం సినిమాలో దారి చూడు దుమ్మూ చూడు అనే పాటతో ఫేమ్ అయ్యాడు పెంచల దాస్. ఆ ఫేమ్ తోనే తర్వాత త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబినేషణ్ లో వచ్చిన అరవింద సమేతలోనూ పాట పాడించడంతో పాటు ఎన్టీఆర్ కు కొత్త స్లాంగ్ ను నేర్పించేందుకు తీసుకున్నారు. అటుపై అందరికీ చెప్పలేదు కానీ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కూ ఆ స్లాంగ్ ను అతనే నేర్పాడు అన్నారు.

అలాంటి పెంచలదాస్ వద్ద ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా స్లాంగ్ లో ట్రెయినింగ్ తీసుకుంటున్నాడు అంటున్నారు. ఈ స్లాంగ్ పాత్రకు ఓ పర్ఫెక్షన్ ను తెస్తుందట. అందుకే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే అని దర్శకుడు చెప్పడంతో అతని వద్దకే వెళ్లారు అంటున్నారు. ఈ పెంచలదాస్ స్వతహాగా స్కూల్ టీచర్. జానపద పాటల రచయిత, గాయకుడు. కొన్ని కథలు కూడా రాశాడు. సీమ సాహిత్యంపై మంచి పట్టున్నవాడు కూడా. అందుకే అతన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకూ తెలంగాణ యాసనే ఎక్కువగా పలికిన విజయ్ దేవరకొండ నోటి వెంట ఈ కొత్త స్లాంగ్ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ కనిపిస్తోంది కదూ..?

Related Posts