మహేష్‌ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ బాటలో.. విజయ్ దేవరకొండ
Latest Movies Tollywood

మహేష్‌ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ బాటలో.. విజయ్ దేవరకొండ

స్టార్ మహేష్ బాబు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు థియేటర్ బిజినెస్ లోకి ప్రవేశించి హైదరాబాద్ లో ఎఎంబి సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ స్టార్ట్ చేయడం.. ఇది సక్సస్ ఫుల్ గా రన్ అవుతుండడం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వి సెల్యూలాయిడ్ పేరుతో అతి పెద్ద బిగ్ స్ర్కీన్ తో మల్టీప్లెక్స్ స్టార్ట్ చేశారు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ స్టార్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ అమీర్ పేటలోని సత్యం థియేటర్ ను ఆయన మల్టీప్లెక్స్ గా మార్చనున్నారు.

ఇప్పుడు మహేష్‌, ప్రభాస్, అల్లు అర్జున్ బాటలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నడవనున్నారు. అవును.. విజయ్ దేవరకొండ కూడా మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ స్టార్ట్ చేయనున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్ప‌టికే రౌడీ పేరుతో బ‌ట్ట‌ల దుకాణాన్ని ప్రారంభించారు. ఇప్పుడు మహబూబ్‌ నగర్లో ఒక మల్టీప్లెక్స్‌ను ప్రారంభించనున్నారు. ఈ మల్టీప్లెక్స్ పేరు ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ (AVD సినిమాస్). మల్టీప్లెక్స్ ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మల్టిప్లెక్స్ కు సంబంధించితిన్ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ మ‌ల్టీప్లెక్స్ ఓపెనింగ్‌కి సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రానుందని సమాచారం.

ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ త్వరలో గోవాలో ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణతో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమా తర్వాత క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ లతో సినిమాలు చేయడానికి ఓకే చెప్పారు.

Post Comment