విజయ్ దేవరకొండ – అనసూయ మధ్య కొత్త రగడ

బుల్లితెర యాంకర్ గా ఫేమ్ అయినా.. ఓ స్టార్ హీరోయిన్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది అనసూయకు. ఆమె యాంకరింగ్ కంటే అందానికే అభిమానులు ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు. తర్వాత సెలెక్టెడ్ మూవీస్ లోనూ మంచి నటనతో ఆకట్టుకుంది.

సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ కెరీర్ లో వివాదాలు కూడా విపరీతంగా ఉన్నాయి. అయితే అర్జున్ రెడ్డి టైమ్ లో ఆ సినిమాలోని డైలాగ్స్ విషయంలో అనసూయ కొన్ని అభ్యంతరాలు పెట్టింది. అప్పటి నుంచి విజయ్ దేవరకొండ అభిమానులు ఆమె అంటే కోపంగా ఉంటున్నారు. ఏ చిన్న ఛాన్స్ వచ్చినా.. ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ గొడవ ఎప్పుడూ సద్దు మణగలేదు కూడా.

ఇటు అనసూయ కూడా ఎప్పుడూ తగ్గలేదు. తనపై వచ్చే ట్రోలింగ్స్ కు దీటుగానే బదులిస్తూ వస్తోంది. అవి మరీ శృతి మించితే ఏకంగా పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొన్నాళ్లుగా కాస్త కామ్ గా ఉన్న అనసూయ లేటెస్ట్ గా మరోసారి విజయ్ దేవరకొండ టార్గెట్ గా చేసిన ట్వీట్స్ తో మరోసారి దుమారం రేగింది.ఈ శుక్రవారం అనసూయ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో ‘‘ఇప్పుడే ఒకటి చూశాను. ‘‘ద’’ నా..? బాబోయ్. పైత్యం. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం’’ అనేదే ఆ ట్వీట్.


ఈ ట్వీట్ కాసేపట్లోనే వైరల్ అయింది. ఇంతకీ ఆ ‘ద’ అంటే ఏంటీ అంటే.. రీసెంట్ గా విజయ్ దేవరకొండ తన పేరు ముందు అది చేర్చుకున్నాడు. అతని టీమ్ ఆ విషయాన్ని ట్విట్టర్ లో పెట్టింది. ‘హీ ఈజ్ హేటెడ్, హీ ఈజ్ లవ్ డ్, బట్ హీ ఈజ్ నెవర్ ఇగ్నోర్డ్.. ద విజయ్ దేవరకొండ’ అంటూ చేసిన ట్వీట్ కే అనసూయ అలా కౌంటర్ చేసింది అన్నమాట. మామూలుగా వీరి మధ్య అర్జున్ రెడ్డి టైమ్ నుంచి రైవల్రీ ఉంది. ఛాన్స్ రాగానే అనసూయ ఇమ్మీడియొట్ గా కౌంటర్ వేసింది.


ఇంతకీ ద విజయ్ దేవరకొండ అన్నంత మాత్రాన ఏంటీ సమస్య అనిపించకమానదు. అయితే ఆ ద అనే అక్షరాన్ని ఓ బ్రాండ్ గా రాసుకుంటారు చాలామంది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవరూ ఇప్పటి వరకూ అలా రాసుకోలేదు. అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, మోహన్ లాల్, మెగాస్టార్,ఇలా.. లెజెండ్స్ ఎవరూ ద రజినీకాంత్, ద అమితాబ్ అని రాసుకోలేదు.

ఇంకా కెరీర్ లో పూర్తిగా నిలదొక్కుకోని విజయ్ దేవరకొండ ఇలా రాసుకునేసరికి అనసూయ కౌంటర్ వేసింది. దానికి విజయ్ ఫ్యాన్స్ ఎప్పట్లానే యాంకర్ పై బూతులతో విరుచుకుపడుతున్నారు. అందకు అనసూయ కూడా ఏ మాత్రం తగ్గడంలేదు. అందరికీ కౌంటర్స్ ఇస్తోంది. ఈ సారి తనతో పాటు ఆమె ఫ్యాన్స్ ఫేజెస్ కూడా రియాక్ట్ అవుతూ విజయ్ ఫ్యాన్స్ కు కౌంటర్స్ ఇస్తున్నారు.

విశేషం ఏంటంటే.. అనసూయను అన్ని విషయాల్లో విభేదించే వారు కూడా ఈ విషయంలో ఆమెకు సపోర్ట్ గా ట్వీట్స్ చేస్తున్నారు. ఏదేమైనా విజయ్ దేవరకొండ అలా పెట్టుకోకుండా ఉండాల్సింది అంటూ మరికొందరు తటస్తంగా ఉన్నారు. ఇంతకీ విజయ్ కి ఈ సలహా ఇచ్చింది ఎవరూ..? అనిపిస్తోంది కదూ..

Related Posts