విక్టరీ వెంకటేష్ గా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు వెంకటేష్. లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు తనయుడుగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ కెరీర్ ఆరభం నుంచి ఎన్నో వైవిధ్యమైన కథలు చేసి విక్టరీని ఇంటిపేరుగా మార్చుకున్నాడు. వారసత్వాన్ని దాటుకుని సత్తా చాటి తన తరం హీరోల్లోనే ఉత్తమ నటుడుగా అత్యధిక అవార్డులు సాధించాడు.

నిన్నటి తరంలో ఆ నలుగురు హీరోలుగా చెప్పుకునే ఒకడిగా ఉన్నా.. మిగతా ముగ్గురి ఇమేజ్ నూ సొంతం చేసుకున్న రేర్ స్టార్ వెంకటేష్‌. అయితే ఆ మిగతా స్టార్స్ తో పోలిస్తే కాస్త వేగం తక్కువ. అందుకే 1986లోనే కలియుగ పాండవులుతో కెరీర్ మొదలుపెట్టిన వెంకీ ఇప్పటి వరకూ కేవలం 74 సినిమాలు మాత్రమే చేశాడు. ఇక త్వరలోనే 75వ సినిమా అనే మైల్ స్టోన్ ను చేరబోతున్నాడు. కెరీర్ లో ఒక్కసారే వచ్చే ఇలాంటి మైల్ స్టోన్ మూవీని మెమరబుల్ గా మార్చుకునేందుకు మంచి కథ కోసం చూస్తున్నాడు వెంకటేష్‌. ఇప్పటి వరకూ యంగ్ స్టర్స్ తో పాటు సీనియర్ దర్శకులు ఎంతోమంది చెప్పిన కథలు విన్నాడు. అవేవీ నచ్చలేదు. చివరగా సూపర్ హిట్ డైరెక్టర్ ను లాక్ చేశాడు.


డాక్టర్ నుంచి డైరెక్టర్ అయిన శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకటేష్‌ 75వ సినిమా రాబోతోంది. శైలేష్ ఫస్ట్ మూవీ హిట్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. లేటెస్ట్ గా వచ్చిన హిట్2 సైతం బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అలాంటి దర్శకుడు చెప్పిన కథకు వెంకీ ఓకే చెప్పాడు. శైలేష్‌ తరహాలోనే కాస్త రియలిస్టిక్ గా సాగే ఈ చిత్రం హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. అంతే కాదు..

వెంకీ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో కూడా వస్తున్నారు. ఆ మధ్య శ్యామ్ సింగరాయ్ వంటి మూవీతో టేస్ట్ చాటుకున్ను నీహారిక ఎంటర్టైన్మెంట్‌స్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోంది. మొత్తంగా ఈ కథ కోసం సురేష్ బాబుతో కలిసి చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు వెంకీ. ఫైనల్ గా తన ఎదురుచూపులకు ఫుట్ స్టాప్ పడింది. ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటూనే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. 2023 ఆరంభంలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందట.