వీర సింహారెడ్డి సెన్సార్ టాక్ ..

కొన్ని సినిమాలు శాశ్వత ఇమేజ్ లను ఇస్తాయి. అలా నందమూరి బాలకృష్ణకు సీమ సింహంగా, ఫ్యాక్షన్ హీరోగా తిరుగులేని ఇమేజ్ ను ఇచ్చింది సమరసింహారెడ్డి. ఈ మూవీతో పాటు ఆ తర్వాత అదే బ్యాక్ డ్రాప్ లో చేసిన నరసింహనాయుడు అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేశాయి. అయితే ఈ ఇమేజ్ నే నమ్ముకుని బాలయ్య చేసిన సినిమాలన్నీ తర్వాత బాక్సాఫీస్ వద్ద దారుణంగా పోయాయి. కొన్నిసార్లు విపరీతమైన ట్రోలింగ్ కు కూడా గురయ్యాడు బాలయ్య.

మళ్లీ సింహా వచ్చే వరకూ ఆ మూస నుంచి బయటకు రాలేకపోయాడు. బట్ సింహా ను ఫాలో అవుతూనే వచ్చిన లెజెండ్ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే బాలకృష్ణ కెరీర్ లో సమర సింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలకు కూడా పర్మనెంట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ వీరసింహారెడ్డిగా ఈ 12న ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి వీర సింహారెడ్డి చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది.


ఇక సెన్సార్ టాక్ చూస్తే ఇందులో సమరసింహారెడ్డిలో ఉన్న ఎమోషన్స్ తో పాటు నరసింహనాయుడులో ఉన్న సెంటిమెంట్స్ ను మిక్స్ చేసినట్టుగా ఉందంటున్నారు. ఫస్ట్ టైమ్ బాలయ్య ఓ లేడీ విలన్ ను ఫేస్ చేశాడు. తనే వరలక్ష్మి శరత్ కుమార్. దినయా విజయ్ కూడా విలన్ గా నటించినా ప్రధానంగా వరలక్ష్మితో వచ్చే సీన్స్ విజిల్ బ్లోయింగ్ గా ఉంటాయని చెబుతున్నారు.

అలాగే హనీరోజ్ తో వచ్చే కొన్ని సీన్స్ అందరు ఆడియన్స్ చేతా కంటతడి పెట్టిస్తాయనే టాక్ వచ్చింది. ఈ ఎపిసోడ్ తర్వాతే ఆయన కత్తి పట్టి సీమలో ఇంకెవరూ కత్తి పట్టకుండా చేయాలనే శపథం తీసుకుంటాడట. శ్రుతి హాసన్ రోల్ రెగ్యులర్ హీరోయిన్ లానే ఉన్నా.. చివర్ లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకునేలా ఉంటుందట. సినిమాలో రక్తపాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందట.

సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ విజిల్స్ కొట్టిస్తాయంటున్నారు. థమన్ మరోసారి అఖండ రేంజ్ ఆర్ఆర్ ఇచ్చాడట.ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ రేంజ్ లో ఉంటే.. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ వచ్చే ప్రతి సీన్ హైలెట్ గా ఉంటుందంటున్నారు. సో.. ప్రస్తుతం సెన్సార్ టాక్నిజమే అయితే ఇది పూర్తిగా బాలయ్య మార్క్ ఎంటర్టైనర్. హార్డ్ కోర్ బాలయ్య ఫ్యాన్స్ ను శాటిస్ ఫై చేయడమే లక్ష్యంగా తీసినట్టు చెబుతున్నారు.

Related Posts