24 క్రాఫ్ట్స్ లో కెప్టెన్ గా నిలిచే డైరెక్టర్ కు పరిశ్రమలో గురువు స్థానం ఇచ్చారు పెద్దలు.
ఆ స్థానం లో నిలిచిన దర్శకులను గుర్తు చేసుకుంటూదర్శకుల కు గౌరవం తెచ్చిన దాసరి నారాయణరావు గారి జయంతి ని ఘనం గా నిర్వ హించారు.
ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ, దామోదర ప్రసాద్, సి కళ్యాణ్, ఎన్ శంకర్, తమ్మారెడ్డి భరద్వాజ్, అనిల్ రావిపూడి, వైవియస్ చౌదరి, జీవిత రాజశేఖర్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సదర్భంగా మీడియా ప్రతినిధులను సత్కరించారు.
టీవీ5 ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ రాంబాబు గారిని దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ ప్రముఖ దర్శకుడు అనీల్ రావిపూడి సన్మానించారు.