టాలీవుడ్ కి సంక్రాంతి ఇబ్బందులేనా.?

టాలీవుడ్ కి ముఖ్య‌మైన సీజ‌న్ అంటే సంక్రాంతి. అందుక‌నే ఈ సీజ‌న్ లో సినిమాలు రిలీజ్ చేసేందుకు హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు పోటీప‌డుతుంటారు. ఈ సీజ‌న్ లో సినిమా రిలీజ్ చేస్తే.. రెగ్యుల‌ర్ గా వ‌చ్చే క‌లెక్ష‌న్స్ కంటే రెట్టింపు క‌లెక్ష‌న్స్ వ‌స్తాయి. అందుక‌నే సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేసేందుకు ఎప్ప‌టి నుంచో ప్లాన్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఏపీలో టిక్కెట్ల వ్య‌వ‌హారం పెద్ద స‌మ‌స్య‌గా మారింది. దీనికి తోడు బెనిఫిట్ షోలు లేవు.

అయితే.. సినిమా ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల గురించి ప్ర‌భుత్వం ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సినీ రంగానికి చెందిన వారూ ఉన్నారు. ఈ కమిటీ ఏపీలో టికెట్ల రేట్ల విషయం తేలుస్తుంది అని అంటున్నారు. అయితే.. ఈ కమిటీ ఎప్పటిలోగా ఈ విషయం తేలుస్తుంది అన్నది కాల పరిమితి అయితే లేదు. తాజాగా కమిటీ సమావేశమైంది కానీ మరింత అధ్యయనం చేయడానికి అంటూ జనవరి 11నకు వాయిదా వేశారు.

ఆ తేదీకైనా క‌రెక్ట్ గా క‌మిటీ త‌న నివేదిక‌ను అందిస్తుందా..? అప్ప‌టికైనా టిక్కెట్ల రేట్లు, బెనిఫిట్ షోల గురించి క్లారిటీ వ‌స్తుందా అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రో వైపు ఆర్ఆర్ఆర్ వాయిదా అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే రాధేశ్యామ్ కూడా వాయిదా అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. అందుక‌నే టాలీవుడ్ కి సంక్రాంతి ఉన్నట్టా..? లేనట్టా..? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి.. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Posts