త్రివిక్రమ్ సినిమా అంటే మరో హీరోయిన్ తో పాటు మాజీ హీరోయిన్ గ్యారెంటీగా ఉండాల్సిందే అనే సెంటిమెంట్ పడిపోయింది. అందుకు తగ్గట్టుగానే ఆయన కథలు రాసుకుంటాడా లేక తన కథల్లోకే ఈ పాత్రలు అవసరమా అనేది ఆన్సర్ లేని క్వశ్చన్. బట్ ఇలాగైనా పాతతరం హీరోయిన్లతో కొత్త పాత్రలు చేయిస్తూ వారికి సరికొత్త కెరీర్ కూడా అందిస్తుంటాడు. అలాగని వారి పాత్రలేమీ ఏదో ఉన్నాయంటే ఉన్నాయి అని కాక.. బలంగానే రాస్తాడు. అలా ఇప్పుడు మహేష్ బాబు మూవీ కోసం మరో హీరోయిన్ ను తెస్తున్నాడు. అయితే ఈమె ఆల్రెడీ రాజమాతలా ఆడియన్స్ మైండ్ లో ఉండిపోయింది.

మరి ఎవరో తెలుసు కదా..?
అత్తారింటికి దారేదీ నుంచి త్రివిక్రమ్ సినిమాల్లో మాజీ హీరోయిన్లు అత్తలుగానో, అమ్మలుగానో కనిపించడం మొదలైంది. అత్తారింటికి లో నదియాను తెచ్చాడు. ఆమె సినిమాకే హైలెట్ అయింది. అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అ ఆ, అరవింద సమేతలో ఈశ్వరీరావు, అల వైకుంఠపురములోతో టబును తెచ్చాడు. అయితే టబును మరోసారి మహేష్ బాబు మూవీలో కూడా తీసుకుంటున్నారు అనే టాక్ వచ్చింది. అయితే తనను కాదని తెలుగులో ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు చేసిన శోభనను తీసుకువస్తున్నారు అనే టాక్ వచ్చింది. తనకోసం చాలా రోజులు చూసి మరీ తెచ్చారట. తను హైదరాబాద్ వచ్చి కథ కూడా విన్నది అంటారు.

కాకపోతే తన సమాధానం మాత్రం చెప్పలేదట. మరి ఏదో ఒకటి తేల్చకపోతే సినిమా ఆలస్యం అవుతుంది కదా.. అందుకే ఇప్పుడు రమ్యకృష్ణను తీసుకోవాలనుకుంటున్నారు అనే టాక్ వస్తోంది. బాహుబలి కంటే ముందే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి పాత్రలు మొదలుపెట్టింది రమ్యకృష్ణ. బట్ బాహుబలితో నేషనల్ వైడ్ గా ఫేమ్ అయింది. ఏకంగా తను చేసిన పాత్ర పేరుతోనే తనను రాజమాత అనేస్తున్నారు.

ఈ మూవీలో ప్రభాస్ కు పిన్నిగా రానాకు తల్లిగా నటించింది. ఇప్పుడు కూడా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తోంది రమ్యకృష్ణ. అలాంటి తను కుంటే ఆమె ఇమేజ్ కూడా ప్లస్ అవుతుందని అప్రోచ్ అయ్యారట. సో.. త్వరలోనే ఈ కాంబినేషన్ గురించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. అయితే తను మహేష్ బాబుకు అత్తగా నటిస్తోందా లేక అమ్మనా అనేది తెలియాలి. ఇక రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ అయినఈ మూవీలో మహేష్ సరసన పూజాహెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏదేమైనా త్రివిక్రమ్ సెలక్షనే సెలక్షన్ కదా..?
