చిరు, బాలయ్య.. ఇద్దరిలో త్రిష ఎవరికి ఓకే చెప్పనుంది..?
Latest Movies Tollywood

చిరు, బాలయ్య.. ఇద్దరిలో త్రిష ఎవరికి ఓకే చెప్పనుంది..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆచార్య ఒక పాట మినహా షూటింగ్ పూర్తయ్యింది. ఇక లూసీఫర్ రీమేక్ గా రూపొందుతోన్న గాడ్ ఫాదర్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. వీటితో పాటు చిరంజీవి మెహర్ రమేష్‌ డైరెక్షన్ లో భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నారు. ఇటీవల చిరు బర్త్ డే సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఇందులో చిరు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. అయితే… ఈ సినిమాలో చిరు సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు కానీ.. త్రిషను కాంటాక్ట్ చేసారని తెలిసింది.

స్టాలిన్ సినిమాతో చిరు సరసన త్రిష నటించింది. ఆచార్య సినిమాలో కూడా త్రిషనే అనుకున్నారు. అయితే.. లాస్ట్ మినిట్ లో త్రిష ఆచార్య నుంచి తప్పుకుంది. ఆతర్వాతే కాజల్ అగర్వాల్ ను తీసుకోవడం జరిగింది. ఇక బాలయ్య విషయానికి వస్తే… ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య క్రాక్ సినిమాతో సక్సస్ సాధించిన మలినేని గోపీచంద్ తో సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. దసరాకి ఈ మూవీని స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. అయితే.. ఈ సినిమాలో బాలయ్య సరసన నటించేందుకు త్రిషను కాంటాక్ట్ చేశారని తెలిసింది.

తమిళ్ లో కానీ తెలుగులో కానీ త్రిష ప్రస్తుతం సినిమాలు ఏమీ చేయడం లేదు. చిరు, బాలయ్య సినిమాలకు ఓకే చెబితే త్రిష మళ్లీ టాలీవుడ్ లో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. చిరు, బాలయ్య సినిమాలకు ఓకే చెబుతుందా..? లేక ఈ రెండు సినిమాల్లో ఒక సినిమాకే ఓకే చెబుతుందా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. త్రిష ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Post Comment