ట్రెండింగ్ లో నెంబ‌ర్ 1 ప్లేస్ లో నిలిచి దుమ్ములేపుతున్న “పుష్ప” ట్రైల‌ర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. రెండు పార్ట్ లుగా రాబోతున్న పుష్ప ఫ‌స్ట్ పార్ట్ డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సంద‌ర్భంగా పుష్ప ట్రైల‌ర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తోంది. యూ ట్యూబ్ లో సైతం భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది.

ఇప్పటి వరకూ నాలుగు భాషల్లో కలిపి 15 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. హిందీలో ఈరోజు ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. హిందీ వెర్స‌న్ కి కూడా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తుంది. 1 మిలియ‌న్ కి పైగా లైక్స్ సాధించి.. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నెంబ‌ర్ 1 ప్లేస్ లో నిలిచింది. అల్లు అర్జున్ ఊర మాస్ గెటప్ లో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి త‌గ్గ‌ట్టుగా ట్రైల‌ర్ లో ర‌ఫ్ అండ్ ట‌ఫ్ అన్న‌ట్టుగా.. భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఉండ‌డం.. బ‌న్నీ ఊర మాస్ అవ‌తారంలో క‌నిపించ‌డంతో పుష్ప పై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి.

బ‌న్నీ, సుక్కుల‌కు ఇది ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ కావ‌డంతో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎంతో కేర్ తీసుకుని ప‌క్కా ప్లానింగ్ తో ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. అంచ‌నాల‌కు మించిన విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని పుష్ప‌ టీమ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. మ‌రి.. పుష్ప ఏ రేంజ్ స‌క్స‌స్ సాధిస్తుందో చూడాలి.

Related Posts