ఆస్ట్రేలియా ఫిల్మ్ పెస్టివ‌ల్‌లో ‘దహిణి – మంత్రగత్తె’

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ తెరకెక్కించిన మరో విలక్ష‌ణ చిత్రం ‘దహిణి – మంత్ర‌గ‌త్తె’. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ వేదిక‌ల‌పై ఈ సినిమా అద్భుత‌మైన స్పంద‌న‌ను, అవార్డుల‌ను రాబ‌ట్టుకుంటోంది. తాజాగా రాజేష్ ట‌చ్ రివ‌ర్ కీర్తి కిరీటంలో మ‌రో వ‌జ్రం చేరింది. ఆస్ట్రేలియాలో జ‌రిగిన టైటాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ పెస్టివ‌ల్‌లో బెస్ట్ ఫీచ‌ర్ ఫిల్మ్‌గా ‘దహిణి – ది విచ్’ అవార్డ్‌ను ద‌క్కించుకుంది. ఈ అవార్డును సోమ‌వారం రోజున‌ సిడ్నీలోని ప్యాలెస్ చౌవెల్ సినిమాలో ఘ‌నంగా నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ సంవ‌త్స‌రం ప్రారంభంలో ప‌సిఫిక్ బీచ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ వేడుక‌ల్లో బెస్ట్ ఫీచ‌ల్ ఫిల్మ్‌గా నిలిచింది. స్వీడిష్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ వేడుక‌ల్లో బెస్ట్ ఫీచ‌ర్ మూవీగా నామినేట్ అయ్యింది.

ద‌హిణి – మంత్ర‌గ‌త్తె మూవీ సోష‌ల్ థ్రిల్ల‌ర్. భార‌త‌దేశం 17 రాష్ట్రాల‌ అన్వేష‌ణ‌లో ఉన్న మంత్ర‌గ‌త్తె క‌థే ఈ సినిమా. ఇదొక క్రూర‌మైన వాస్త‌విక‌త‌. అంత‌ర్జాతీయంగా పలు ప్ర‌శంస‌ల‌ను అందుకున్న ద‌ర్శ‌కుడు రాజేష్ ట‌చ్ రివ‌ర్ మంత్ర‌గ‌త్తె అన్వేష‌ణ అనే విల‌క్ష‌ణ‌మైన కాన్సెప్ట్‌తో సినిమాను తెర‌కెక్కించారు. దీంతో ఇండియా స‌హా ప‌లు దేశాలను పీడిస్తున్న మాన‌వ హ‌క్కులకు సంబంధించిన ఆందోళ‌న‌ను ప్ర‌స్తావించారు.