రాజమౌళి బాహుబలి పుణ్యమా అని ఇప్పుడు లాంగ్వేజ్ బారికేడ్స్ అన్నీ బద్ధలు అయ్యాయి. టాలెంట్ ఉంటే చాలు.. ఎవరు ఏ భాషలో అయినా నటిస్తున్నారు. డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలూ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఒకప్పుడు రీమేక్ ల ఇండస్ట్రీ అని అన్ని భారతీయ భాషల ప్రేక్షకులతోనూ అనిపించుకున్న పరిశ్రమ కన్నడ పరిశ్రమ. నిజంగానే అక్కడ ఇప్పుడు చాలా పెద్ద స్టార్స్ అని చెప్పుకుంటోన్న చాలామంది.. తెలుగు, తమళ్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను రీమేక్ చేసి స్టార్స్ అయిన వారే. బట్ కొన్నాళ్లుగా శాండల్ వుడ్ మారుతోంది. వైవిధ్యమైన సినిమాలు, యూనివర్సల్ కంటెంట్ ఉన్న మూవీస్ అక్కడి నుంచి వస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో కెజీఎఫ్ రెండు భాగాలు, కాంతార చిత్రాలు ప్యాన్ ఇండియన్ రేంజ్ లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మరోవైపు కొత్తగా వస్తోన్న దర్శకులు కూడా సరికొత్తగా ఆలోచిస్తున్నారు. అందుకే ఇప్పుడు మన టాలీవుడ్ హీరోలు కూడా కన్నడ దర్శకులతో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం సలార్ తో ప్రభాస్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ నెక్ట్స్ మూవీ మళ్లీ తెలుగు స్టార్ ఎన్టీఆర్ తోనే ఉంది. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ తో నర్తన్ అనే కన్నడ దర్శకుడు ఓ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. ఇంకా అఫీషియల్ గా కన్ఫార్మ్ కాకపోయినా.. ఈ వార్త అబద్ధం కాదు అనేది ఖచ్చితంగా వినిపిస్తోంది. చరణ్ ఇంకా చెప్పకపోయినా ఇప్పుడు గోపీచంద్ ఏకంగా హర్ష అనే కన్నడ దర్శకుడితో సినిమా ప్రారంభం కూడా చేయడం విశేషం.


దర్శకుడు హర్షది సినిమా ఫ్యామిలీయే. బాలనటుడుగా ఎంట్రీ ఇచ్చాడు. విచిత్రంగా అతను కొరియోగ్రాఫర్ గా మారాడు. 300 సినిమాలకు కొరియోగ్రఫీ కూడా అందించాడు. ఫస్ట్ మూవీ గెలేయాతో హిట్ అందుకున్నాడు. మంచి కొరియోగ్రాఫర్ కావడంతో అతని టేకింగ్ కూడా బావుంటుంది అన్న టాక్ వచ్చింది. దీంతో శివరాజ్ కుమార్ కూడా ఛాన్స్ ఇచ్చాడు. శివన్నతో చేసిన భజరంగి బ్లాక్ బస్టర్ అయింది. ఇక తమిళ్ లో సూపర్ హిట్ అయిన పూజ చిత్రాన్ని అంజనీ పుత్రగా దివంగత పునీత్ రాజ్ కుమార్ తో రీమేక్ చేస్తే అక్కడా హిట్ అయింది. శివరాజ్ కుమార్ తోనే చేసిన భజరంగి2 తో పాటు రీసెంట్ గా వచ్చి వేద చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అలాంటి హర్ష డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం అయింది.


గోపీచంద్ ప్రస్తుతం రామబాణం అనే సినిమా చేస్తున్నాడు. ఇది సమ్మర్ లో విడుదలవుతుంది. తర్వాత స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్ ఇదే. ఇక గతంలో గోపీచంద్ ప్రిస్టీజియస్ మూవీగా వచ్చిన అతని 25వ సినిమా పంతంను నిర్మించిన కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి గోపీచంద్ తర్వాత కన్నడ డైరెక్టర్ తో పనిచేసే హీరో రామ్ చరణ్ అవుతాడా లేక ఇంకెవరైనా లైన్ లోకి వస్తారా అనేది తెలియదు కానీ.. ప్రస్తుతం మన హీరోలు కన్నడ దర్శకులతో పనిచేయడానికి భలే ఉత్సాహం చూపిస్తున్నారు అనే చెప్పాలి.

, , , , , , , , , , , , , , , , , , , , ,