బ‌న్నీకి క‌లిసొచ్చింది. మ‌రి.. వ‌రుణ్ తేజ్ కి వ‌ర్కువుట్ అవుతుందా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం పుష్ప‌. ఈ సినిమా బ‌న్నీ, సుక్కు.. ఇద్ద‌రికీ ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ. అదుచేత నార్త్ లో పుష్ప చిత్రానికి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో అని ఫ్యాన్స్ తో పాటు మేక‌ర్స్ కూడా ఆస‌క్తిగా ఎదురు చూశారు. అయితే.. అంద‌రికీ షాక్ ఇస్తూ.. బాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పుష్ప‌ సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో టాలీవుడ్ నుంచి వ‌చ్చే పాన్ ఇండియా మూవీస్ కు బాలీవుడ్ లో మాంచి క్రేజ్ ఏర్ప‌డింది.

అలాగే బాలీవుడ్ లో టాలీవుడ్ మూవీస్ కి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ మేక‌ర్స్ త‌మ సినిమాల‌ను పాన్ ఇండియా లెవ‌ల్లో రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. పుష్ప సినిమాకి వ‌చ్చిన క్రేజ్ దృష్ట్యా మరో మెగా హీరో వ‌రుణ్ తేజ్ కూడా గ‌ని సినిమాని పాన్ ఇండియా లెవ‌ల్లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నార‌ట‌. అస‌లు గ‌ని చిత్రాన్ని ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు కానీ.. ఆ తేదీకి రాలేదు. భీమ్లా నాయ‌క్ రిలీజ్ అవుతుంద‌ని వాయిదా వేసార‌నుకున్నారు కానీ.. వాస్త‌వం ఏంటంటే.. గ‌ని చిత్రాన్ని పాన్ ఇండియా కేటగరిలీలో పెద్ద ఎత్తున రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నార‌ట‌. అందుక‌నే వాయిదా వేసార‌ని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

గని బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. వరుణ్ తేజ్ బాక్సర్ గా పాత్రలో న‌టించాడు. స్ర్కిప్ట్ డిమాండ్ మేరకు బాలీవుడ్ నటులు సాయి మంజ్రేకర్.. సునీల్ శెట్టి లాంటి టాప్ స్టార్లను సైతం రంగంలోకి దించారు. వ‌రుణ్ తేజ్, సునీల్ శెట్టిల బాక్సింగ్ పోరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అంటున్నారు. ఈ సినిమాతో అల్లు అరవింద్ తనయుడు బాబి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఇలా సినిమాలో ఇన్ని ప్రత్యేకతలున్నాయి. అందుక‌నే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు స‌మాచారం. మ‌రి.. పాన్ ఇండియా మూవీ బ‌న్నీకి క‌లిసొచ్చింది. వ‌రుణ్ తేజ్ కి వ‌ర్కువుట్ అవుతుందో లేదో చూడాలి.

Related Posts