తిమ్మరుసు – రివ్యూ
Latest Reviews

తిమ్మరుసు – రివ్యూ

సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన చిత్రం తిమ్మరుసు. అసైన్‌మెంట్‌ వాలి సినిమా ట్యాగ్‌లైన్‌. ఇందులో బ్రహ్మాజీ, వైవా హర్ష, రవిబాబు, అంకిత్, అజయ్ ముఖ్యపాత్రలు పోషించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. మహేశ్‌ కోనేరు, సృజన్‌ సి ఈ సినిమాని నిర్మించారు. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ కు అనూహ్యమైన స్పందన వచ్చింది. దీంతో తిమ్మరుసు సినిమా పై పాజిటివ్ టాక్ ఏర్పడింది. అయితే.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతబడిన థియేటర్లు ఈ రోజు నుంచి ఓపెన్ అయ్యాయి. ఈరోజు తిమ్మరుసు చిత్రం థియేటర్లో రిలీజ్ అయ్యింది. ఇంతకీ.. తిమ్మరుసు ఎలా ఉంది.? ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకున్నాడు..? అనేది చెప్పాలంటే.. ముందుగా కథ చెప్పాల్సిందే.

కథ

రామచంద్ర (సత్యదేవ్) ఓ సిన్సియర్ లాయర్. ఎవరికైనా అన్యాయం జరిగిందని తెలిస్తే.. వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తాడు. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళతాడు. ఎవర్నైనా ఎదురిస్తాడు. అది అతని క్యారెక్టర్. అయితే.. అరవింద్ (చైతన్య) ఓ క్యాబ్ డ్రైవర్. అతన్ని ఎవరో హత్య చేస్తారు. వాసు (అంకిత్) అనే కుర్రాడ్ని ఆ హత్యలో ఇరికించి ఎనిమిదేళ్లు శిక్ష విధిస్తారు. ఆ కేసు లాయర్ రామచంద్ర దగ్గరకు వస్తుంది. ఆయన ఆ కేసు రీ ఓపెన్ చేసి వాసు తప్పు చేయలేదని.. నిరూపించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో రామచంద్రకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొవల్సి వచ్చింది..? ఆయన ఎదురైన సమస్యలు ఏంటి..? ఆ సమస్యలను ఎలా పరిష్కరించకున్నాడు.? రామచంద్రకు అతని లవర్ అను (ప్రియాంక), సుధాకర్ (బ్రహ్మాజీ) ఎలాంటి సాయం అందించారు.? చివరికి వాసు హత్య చేయలేదని ఎలా నిరూపించాడు అనేదే కథ.

ప్లస్ పాయింట్స్

సత్యదేవ్ నటన
కథ – కథనం
ఇంటర్వెల్ ఎపిసోడ్
సెకండాఫ్

మైనస్ పాయింట్స్

ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్

విశ్లేషణ

సత్యదేవ్‌ నటన ఎంత సహజంగా ఉంటుందో తెలిసిందే. ఈ సినిమాలో కూడా పాత్రకు తగ్గట్టుగా చాలా చక్కగా నటించాడు. ఓ వైపు సాఫ్ట్‌గా కనిపిస్తూనే మరో వైపు ఫైట్‌ సీన్లలోనూ ఇరగదీశాడు. లాయర్‌ పాత్రకు ఆయన పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ అండ్ సప్సెన్స్ సీక్వెన్స్ స్ లో సత్యదేవ్ చాలా బాగా నటించి మెప్పించాడు. ఇక టాక్సీవాలా హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో క్యూట్ లుక్స్ తో అందంగా కనిపించి బాగానే ఆకట్టుకుంది. బ్రహ్మాజీ ఎప్పటిలాగే ప్రేక్షకులను వీలైనంత నవ్వించేందుకు ట్రై చేశాడు. అలాగే వాసు పాత్రలో నటించిన అంకిత్, మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

సస్పెన్స్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సీన్స్ రాసుకోవాలి. అయితే.. ఈ సినిమా ఫస్టాఫ్ లో వచ్చే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. అక్కడక్కడ బోర్ కొడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. అయితే.. సెకండాఫ్ కి వచ్చేసరికి ఇంట్రస్టింగ్ గా చూసేలా చిత్రీకరించడం బాగుంది. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సస్పెన్స్ సీన్స్ మరియు విలన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ బాగుంది. చివర్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమాని ఎండ్ చేయడం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

సినిమాటోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. ఫస్టాఫ్‌ మీద ఇంకాస్త దృష్టి పెట్టుంటే సినిమా ఇంకా బాగుండేది. ఫలితం వేరే లెవల్లో ఉండేది. తిమ్మరుసు గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా హాయిగా చూసి ఎంజాయ్ చేయచ్చు.

రేటింగ్ 2.75/5

 

Post Comment