సినిమా బావుంటే చూస్తారు. దానికి కులం, మతం, జెండర్ ఇష్యూస్ లేవు. బట్ వీటిని ఆపాదిస్తూ కొంతమంది ఎంతోమందికి ఉపాధిని ఇస్తోన్న సినిమాను దెబ్బ తీయాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లకు వారి ప్రయత్నాలకు చెక్ పడింది. అందుకు కారణం కంటెంటే తప్ప అలాంటి వారి ఐడియాలజీ కాదు. ఆ చెక్ పెట్టిన సినిమా పఠాన్. రిలీజ్ కు ముందు ఈచిత్రంపై విషం విరజిమ్మారు. బాయ్ కాట్ చేయాలన్నారు. బికినీ రంగులోనూ దేశభక్తిని చూసే ప్రయత్నం చేశారు. బట్ కంటెంట్ ఉన్న సినిమాలను ఇలాంటి వారు ఏమీ చేయలేరు అని ప్రూవ్ చేసింది పఠాన్. బాలీవుడ్ కు ఓ కొత్త ఊపిరి పోసింది. అంతేకాదు.. ఇలాంటి విద్వేషకారులకు గట్టి బుద్ధి చెబుతోంది.

పఠాన్.. విడుదలకు ముందు విపరీతమైన విద్వేషాన్ని ఎదుర్కొన్న సినిమా. ఈ విద్వేషాల వల్ల ప్రమోషన్ కూడా చేయలేదు మూవీ టీమ్. ఒకప్పుడు బాలీవుడ్ ను శాసించిన షారుఖ్ ఖాన్ లాంటి హీరో కూడా వీరి ధాటికి ఇబ్బంది పడిపోయాడు. అందుకు కారణం కొన్నాళ్లుగా అతనికీ సరైన హిట్ లేదు. దీనికి తోడు ప్రస్తుతం దేశంలో నడుస్తోన్న ఈ బాయ్ కాట్ ట్రెండ్ కు కూడా భయపడ్డారేమో అనుకోవచ్చు. మొత్తంగా ఈ చిత్రానికి మినిమం ప్రమోషన్స్ కూడా చేయలేదు. అయినా భారీ స్థాయిలో విడుదల చేశారు మేకర్స్. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా కావడం.. ట్రైలర్ లోనే ఊరమాస్ ఎలిమెంట్స్ ఉన్నాయని చూపడంతో పఠాన్ కు ప్రమోషన్స్ లేకున్నా.. అంచనాలు ఏర్పడ్డాయి.

ఆ అంచనాలను మొదటి ఆటకే రీట్ అయిందీ చిత్రం. రిలీజ్ కు రెండు రోజుల ముందు నుంచే ప్రదర్శించిన ప్రివ్యూస్ తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక సౌత్ లో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి కాబట్టి రొటీన్ మాస్ ఎంటర్టైనర్ అని మనవాళ్లు తేల్చినా.. బాలీవుడ్ మీడియా మాత్రం పఠాన్ ను ఆకాశానికెత్తింది. దీంతో రోజు రోజుకూ థియేటర్స్ పెరుగుతూ వెళ్లాయి. కట్ చేస్తే ఎవరూ ఊహించని రేంజ్ లో కేవలం 5 రోజుల్లోనే 600 కోట్లు వసూలు చేసి ఎంటైర్ కంట్రీని ఆశ్చర్యపరిచింది. నిజానికి రొటీన్ అనిపించినా.. మాస్ ఎలిమెంట్స్ మెస్మరైజ్ చేస్తాయి. యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ రేంజ్ లో కనిపిస్తాయి. దీపిక పదుకోణ్ గ్లామర్ తో పాటు యాక్షన్ కూడా ఆకట్టుకుంది. చివర్లో వచ్చిన సల్మాన్ ఖాన్ ఎంట్రీ థియేటర్స్ ను షేక్ చేస్తోంది. మొత్తంగా పఠాన్ పై బాయ్ కాట్ మంత్రం పనిచేయలేదు. మరి ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.