మెగాస్టార్ హీటెక్కించాడు. చెప్పినట్టుగానే టైమ్ కు వచ్చిన ట్రైలర్ మాస్ కే కాదు.. బాస్ ఫ్యాన్స్ అందరికీ పూనకాలు తెప్పించేలా ఉంది. చిరంజీవి నుంచి జనం ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారు అనే లెక్కలతో ఖచ్చితమైన కాలిక్యులేషన్స్ తోనే ఈ కథ రాసుకున్నాడు దర్శకుడు బాబీ అని ఈ ట్రైలర్ చూడగానే తెలిసిపోయింది. ఇక సంక్రాంతి వార్ లో వాల్తేర్ వీరయ్య పూనకాలు తెప్పిస్తాడని తేలిపోయింది. ట్రైలర్ మొత్తం క్లాస్, మాస్, ఊరమాస్ లా ఉంది. ప్రతి షాట్ ఓ ఎలివేషన్ షాట్ లా కనిపించింది. బాబీ టేకింగ్ టాలెంట్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. హీరోయిన్ శ్రుతి హాసన్ కు ఎక్కువ స్పేస్ ఇవ్వలేదు కానీ.. వింటేజ్ మెగాస్టార్ మరోసారి అచ్చంగా దించేశాడు బాబీ. ట్రైలర్ చూస్తోంటే ఈ సంక్రాంతికి రికార్డుల మోత ఖాయం అనిపిస్తోంది.

ట్రైలర్ ఆరంభంలోనే ఉప్పొంగుతోన్న సముద్రం మధ్య తన పడవలో వెళ్లే వీరయ్య బ్యాక్ లుక్ తో మొదలైంది. అక్కడి నుంచి పోలీస్ రికార్డ్స్ లో పాపులర్ ఖైదీని పట్టుకున్నారని.. అతను రాత్రికి తప్పించుకోకుండా చూడాలని చెబుతూ పోలీస్ బలగాల హడావిడీతో వీరయ్య ఎంట్రీ ఓ మాసివ్ ఫైట్ సీన్ తర్వాత కనిపిస్తుంది. కట్ చేస్తే సీన్ మలేషియాకు షిఫ్ట్ అయింది. అక్కడే శ్రుతి హాసన్ తో పరిచయంతో పాటు తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ కూడా అందించాడు చిరంజీవి. “మీ పేటలో అమ్మాయిల జోలికి వస్తేనే కదా మీకు ప్రాబ్లమ్ అంటే.. ఏ పేటలో అమ్మాయిల జోలికి వచ్చినా నాకు ప్రాబ్లమే” అని డైలాగ్ ఆకట్టుకుంది.
ఇక విలన్స్ ప్రకాష్ రాజ్, బాబీ సింహాల ఎంట్రీ చాలా గ్రాండ్ గా లావిష్ గా ఉంది.

మీ కథలోకి నేను రాలే.. నా కథలోకే మీరందరూ వచ్చారు.. నుంచి వీడు నా ఎర.. నువ్వే నా సొర.. అనే డైలాగ్స్ నుంచి పూర్తి సీరియస్ గా మారిపోయింది ట్రైలర్. రవితేజ ఎంట్రీ కూడా “వైజాగ్ లో గట్టి ఏటగాడు లేడని.. ఒక పులి పూనకాలతో ఊగుతుందట” అనే డైలాగ్ తో అదరిపోయింది. ” రికార్డ్స్ లో నీ పేరుందన్నమాట” అనే బాబీ సింహా డైలాగ్ కు రిప్లైగా మెగాస్టార్ చెప్పిన ” రికార్డ్స్ లో నా పేరుండటం కాదు.. నా పేరు మీదే రికార్డులుంటాయి” డైలాగ్ విజిల్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఇక చివర్లో చిరంజీవి డైలాగ్ అయిన ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి మాటను రవితేజ డైలాగ్ గా.. ” హలో మాస్టారూ.. ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి.. ఒక్కొక్కలికి బాక్సులు బద్ధలైపోతాయ్” అని చెప్పించండం.. ఆ వెంటనే చిరంజీవి ” ఏంట్రా బద్ధలయ్యేదీ.. ఈ సిటీకి నీలాంటి కమీషనర్లు వస్తుంటారు పోతుంటారు.. కానీ ఇక్కడ వీరయ్య.. లోకల్” అంటూ మెగాస్టార్ ఇచ్చిన రిప్లై చూస్తే థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయం అనిపిస్తోంది. మొత్తంగా వాల్తేర్ వీరయ్య ట్రైలర్ తో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఈ సారి థియేటర్స్ షేక్ అయిపోవడం.. రికార్డులు బద్ధలు కావడం గ్యారెంటీ అనిపిస్తోంది. ఏదేమైనా బాలయ్య ట్రైలర్ ఆయన స్టైల్లో ఉంటే బాస్ ట్రైలర్ ఈయన స్టైల్లో ఉంది. సో.. రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్ లుక్ తో నే కనిపిస్తున్నాయి.