అప్పుడే.. ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ వ‌చ్చేస్తుందా..?
Latest Movies Tollywood

అప్పుడే.. ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ వ‌చ్చేస్తుందా..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్ఆర్ఆర్ నుంచి రెండు పాట‌ల‌ను రిలీజ్ చేశారు. ఈ రెండు పాట‌ల‌కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. మూడో పాట‌ను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక‌ ఈ భారీ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ట్రైల‌ర్ ఎప్పుడు రిలీజ్ చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.

అయితే.. ఈ సినిమా పై అప్పుడే ట్రైలర్ కట్ రెడీగా ఉంది అని ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వార్త సోష‌ల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మ‌రో విష‌యం ఏంటంటే.. డిసెంబర్ మొదటి వారంలోనే ట్రైల‌ర్ రిలీజ్ చేస్తార‌ట‌. అయితే.. జనవరి 7న సినిమా రిలీజ్ అయినా.. ఇంత త్వరగా ట్రైల‌ర్ రిలీజ్ చేస్తారా అనే డౌట్ ఉంది. ఏ సినిమా ట్రైల‌ర్ అయినా మినిమ‌మ్ రెండు వారాలు గ్యాప్ లో రిలీజ్ చేస్తుంటారు. మ‌రి.. సినిమా రిలీజ్ నెల రోజులు ఉంద‌న‌గా రిలీజ్ చేస్తారా అనేదే అనుమానం అంద‌రిలో ఉంది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త పై జ‌క్క‌న్న క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Post Comment