అయ్యగారి సత్తాకు అసలైన ఛాలెంజ్.. ఏజెంట్..

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన సినిమా ఏజెంట్ సినిమా ఈ నెల 28న ఆడియన్స్ ముందుకు వస్తోంది. సాక్ష వైద్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకుడు. సుదీర్ఘ కాలం పాటు చిత్రీకరణ జరుపుకుని.. ఆ తర్వాత రకరకాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి ఆగి ఫైనల్ గా వచ్చే శుక్రవారం వస్తోందీ టీమ్. ప్రమోషన్స్ పరంగా దూకుడుగానే ఉన్నారు. కానీ వారి దూకుడు తగ్గట్టుగా బజ్ అయితే రాలేదు అనే చెప్పాలి. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏమంత ఆసక్తిగా సాగలేదు.

అటు పాటలు ఒక్కటీ హిట్ కాలేదు. హీరోయిన్ తెలుగు ఆడియన్స్ కు( ఆ మాటకొస్తే ఏ ఆడియన్స్ కూ)తెలియదు. ఇటు అఖిల్ ఒక్క హిట్ కోసం నానా తంటాలు పడుతున్నాడు. చివరగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హిట్ అనిపించుకుంది తప్ప.. బ్లాక్ బస్టర్ కాదు. కెరీర్ మొదలుపెట్టి ఇప్పటికే నాలుగు సినిమాలు దాటాయి. మొదటి మూడూ డిజాస్టర్స్ అయితే ఈ నాలుగో బ్యాచులర్ మూవీ మాత్రమే ఓకే అనిపించుకుంది. ఇలాంటి టైమ్ లో అఖిల్ ముందు ఇప్పుడు ఏజెంట్ రూపంలో చాలా పెద్ద టాస్క్ ఉంది.
ఏజెంట్ తో హిట్ కొట్టడం అఖిల్ కు అంత సులువేం కాదు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ చూస్తే ఏ మాత్రం కొత్తదనం కనిపించడం లేదు.

ఒకవేళ వీళ్లు మొదలుపెట్టినప్పుడు కొత్తగా ఉందేమో కానీ.. ఈ మూవీ లేట్ కావడంతో ఆ గ్యాప్ లో ఆ తరహా గన్ ఫైరింగ్, బుల్లెట్ల వర్షం తరహా సినిమాలు చాలానే వచ్చాయి. హిట్ కొట్టాయి. పైగా అఖిల్ రా ఏజెంట్ గా నటించాడు అంటే కాస్త ఆలోచించాల్సిన అంశమే. రా ఏజెంట్స్ ఈ తరహాలో పెద్దగా కనిపించలేదు మనకు. కాకపోతే మమ్మూట్టి లాంటి స్టార్ ఒప్పుకున్నప్పుడే సినిమా హిట్ అని ఫిక్స్ అయ్యాం అని అఖిల్ చెబుతున్నాడు కానీ.. ఇప్పుడు మమ్మూట్టి మరీ చూజీగా ఏం లేరు.

ఈ వయసులో వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా చేస్తున్నారు. అలా చూసినా ట్రైలర్లోనే ఆయన్నుంచి రెండు వాయిస్ లు వినిపించాయి. సినిమాలోనూ అలాగే ఉంటుందా మార్చారా అనేది తెలియదు కానీ.. మమ్మూట్టి వల్ల కొత్తగా టికెట్స్ తెగుతాయని(ముఖ్యంగా గత రెండు తరాల ఆడియన్స్ నుంచి) అనుకోలేం. ఇక దర్శకుడుగా సురేందర్ రెడ్డి టాలెంట్ ను తక్కువ అంచనా వేయలేం. కానీ దర్శకుడు, హీరో మధ్య విభేదాలు అని చాలాకాలంగా మీడియాలో వినిపిస్తూనే ఉన్నది. దీంతో సురేందర్ కూడా ఏదో ఈ ప్రాజెక్ట్ పూర్తయిందీ అనిపించారు అనే టాక్ కూడా ఉంది.


సో.. ఎలా చూసినా అంచనాలు పెంచకుండా.. కొత్తగా కనిపించని కంటెంట్ తో వస్తోన్న అఖిల్ కు ఈ మూవీతో హిట్టెక్కడం అంత ఈజీ కాదు. అయితే ఒకవేళ వీళ్లు లో ప్రొఫైల్ లో వస్తూ సినిమాతో ఆశ్చర్యపరచాలనుకుంటున్నారేమో తెలియదు కానీ.. ఏజెంట్ కు మాత్రం అంత ఈజీ కాదు.

Related Posts