ఆయన ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా నిలబడుతున్నాడు. ఫస్ట్ మూవీకే టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అన్న పేరు రావడంతో తర్వాతి రెండు సినిమాలూ క్రేజీగా పోయాయి. కట్ చేస్తే లేటెస్ట్ గా వచ్చిన చిత్రంతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. ఇదో హారర్ మూవీ. వైవిధ్యమైన నేపథ్యంలో రూపొందిన ఈ హారర్ మూవీలో మెయిన్ స్ట్రీమ్ స్టార్స్ ఎవరూ లేరు. అయినా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఈ హారర్ లో కొత్తదనం ఏం లేదు. ఒకప్పుడు వచ్చిన సినిమాలకు కాస్త కొత్త నేపథ్యాన్ని మాత్రమే యాడ్ చేశారు. అయినా ఆర్ఆర్ తో కొన్ని చోట్ల భయపెట్టారు. దీంతో మంచి రేటింగ్స్ కూడా వచ్చాయీ చిత్రానికి. బట్ మొదట్లో పెద్దగా రెవిన్యూ రాలేదు కానీ.. తర్వాత మౌత్ టాక్ తో మాగ్జిమం కలెక్షన్స్ సాధిస్తూ.. చాలా వరకూ బ్రేక్ ఈవెన్ అవుతుంది అంటున్నారు. అయితే విశేషం ఏంటంటే.. ఈ మూవీకి సంబంధించి మొదట్నుంచీ నిర్మాతే అన్నీ తానై కనిపిస్తున్నాడు. దర్శకుడికి ఇది డెబ్యూ మూవీ కావడం, నిర్మాత ఆల్రెడీ రెండు హిట్స్ కొట్టి ఉండటంతో దర్శకుడు ఏం అనలేకపోతున్నాడట. దీంతో ప్రమోషన్స్ లో కూడా డైరెక్టర్ ను పక్కన బెట్టేసి సదరు నిర్మాత ఆ సినిమాలో కీలక పాత్రలో నటించిన మాజీ హీరోయిన్ తో కలిసి అన్ని స్టూడియోస్ కు తిరుగుతున్నాడు. నిజానికి ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తే క్రెడిట్ దర్శకుడికే ఇవ్వాలి. కానీ ఆ నిర్మాత అంతా తన అకౌంట్ లో వేసుకుంటున్నాడు. పైగా ఆ మాజీ హీరోయిన్ తో మరీ క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు.. అందుకే డైరెక్టర్ ను సైడ్ చేశాడు అనే కమెంట్స్ కూడా ఉన్నాయి. మొత్తంగా హ్యాట్రిక్ హిట్స్ తో ఉన్నాడు కాబట్టి..ఈ జోష్‌ ఇలాగే ఉంటుంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ హ్యాట్రిక్ ప్రొడ్యూసర్ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.