Jr NTR : సముద్రం అంతా అతను రక్తంతో రాసిన కథలతో నిండి ఉంది..

సముద్రం అంతా అతను రక్తంతో రాసిన కథలతో నిండి ఉంది.. ఈ డైలాగ్ చాలేమో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా దమ్మేంటో తెలియడానికి.

సినిమా ఓపెనింగ్ రోజే శివ చెప్పాడు. జనసంచారం పెద్దగా లేని సముద్ర తీర ప్రాంతాల్లో జరిగే కథ ఇది అని. జన సంచారం లేదు అంటే నరరూప రాక్షసుల్లాంటి మనుషులు ఉంటారు కదా..? వారి వల్ల ఇతర ప్రపంచానికి వచ్చే సమస్యలను తీర్చే యోధుడుగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు.


ఇక ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఏదైనా కొత్త అప్డేట్ వస్తుందని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ఏకంగా ఫస్ట్ లుక్ నే విడుదల చేయబోతున్నాడు కొరటాల శివ. నిజంగా ఇది ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేయలేదు.ఇప్పటికే చాలా వేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. కావాలంటే ఓ యాక్షన్ ఎపిసోడ్ నుంచి చిన్న టీజర్ కూడా విడుదల చేయొచ్చు. మరి గ్లింప్స్ లాంటిది ఏదైనా విడుదల చేస్తారా లేక కేవలం ఫస్ట్ లుక్ తో సరిపెడతారా అనేది తెలియదు కానీ.. ఈ శుక్రవారం మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతోంది.


ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూ�