ఎన్టీఆర్ గ్రాఫ్ పడిపోతోందా..?
Latest Movies Tollywood

ఎన్టీఆర్ గ్రాఫ్ పడిపోతోందా..?

ఎన్టీఆర్ గ్రాఫ్ పడిపోతోందా..? అంటే అవుననే అంటున్నారు చాలామంది. అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయి. అంతా అనుకుంటున్నట్టుగా కేవలం జెమినీ టివిలో ప్రసారం అవుతోన్న ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కు రేటింగ్ రాకపోవడం అనే కారణం మాత్రమే కాదు. ఇంకా ఉన్నాయి. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ లో నటించి ఉన్నాడు ఎన్టీఆర్. ఈ మూవీలో అతనితో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరికీ డబ్బింగ్ మార్కెట్ రూపంలో బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది. అయితే రామ్ చరణ్ కు కాస్త ఎక్కువ క్రేజ్ ఉందనేది నిజం. కారణం.. అతని మగధీరకు తిరుగులేని వ్యవర్ షిప్ ఉంది. అలాగే డైరెక్ట్ గా తుఫాన్ సినిమా కూడా చేసి ఉన్నాడు. ఆ మేటర్ పక్కన బెడితే.
ఇప్పుడు ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీగా కొరటాల శివతో కమిట్ అయి ఉన్నాడు. అయితే ఈ చిత్రానికి ఇంకా కథ తేలలేదు. మరోవైపు తన తోటి హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్ లు ప్యాన్ ఇండియన్ రేంజ్ లో తమ మార్కెట్ ను బాగా విస్తరించుకుంటున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్పపై తిరుగులేని క్రేజ్ ఉందిప్పుడు. అలాగే చరణ్ కూడా నెక్ట్స్ మూవీ శంకర్ తో కమిట్ అయి ఉన్నాడు. ఈ సినిమాతో చరణ్ రేంజ్ ఖచ్చితంగా మారుతుందని చెప్పొచ్చు. ఇక ప్రభాస్ టాలీవుడ్ లెవెల్ ఎప్పుడో దాటాడు. మహేష్, పవన్ కళ్యాణ్ ల స్థాయికి ఇంకా ఎన్టీఆర్ రాలేదు. కాకపోతే టాప్ ఫైవ్ లో ఉన్నాడు అనుకున్నా… ప్రభాస్ కూడా ఈ లిస్ట్ లో ఉంటే ఎన్టీఆర్ నెంబర్ 6 అవుతుందంటున్నారు విశ్లేషకులు.
ప్రస్తుతం ఎన్టీఆర్ కు ఉన్న పోటీ చరణ్, అల్లు అర్జున్ లతోనే. వీరి సినిమాలతో పోలిస్తే ఆ రేంజ్ కలెక్షన్స్ ఇంకా ఎన్టీఆర్ ఖాతాలో లేవు.రీసెంట్ గా కూడా చరణ్ రంగస్థలంతో, అర్జున్ అల వైకుంఠపురములోతో దేశవ్యాప్త ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ కు అలాంటి హిట్ లేదనేది ఎంత నిజమో.. కొరటాల శివ రేంజ్ ను బట్టి.. ఆ సినిమాతో వస్తుందనుకోవడం కూడా అంతే పొరబాటు. కొరటాల చేసిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనేనేను వంటి సినిమాలేవీ నార్త్ ఆడియన్స్ ను మరీ ఆకట్టుకోలేదు. హీరోలను బట్టి వెళ్లాయి అంతే.
ఇక ఇక్కడ మీలో ఎవరుకోటీశ్వరుడుకు రేటింగ్ దారుణంగా ఉంది. ఈ విషయంలో చాలా ట్రోలింగ్స్ కూడా వస్తున్నాయి. కాకపోతే ఎన్టీఆర్ వరకూ బానే ఉన్నా.. షో నిర్వహణలోనే లోపాలు కనిపిస్తున్నాయి. ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేసేంత గొప్ప నాలెడ్జ్ ఉన్నవాళ్లెవరూ ఇంత వరకూ ఈ షోకు రాలేదు. కారణాలేవైనా.. ఎన్టీఆర్ వల్ల భారీ క్రేజ్ వస్తుందనుకున్న షో.. యావరేజ్ గా మిగిలిపోయింది.
అభిమానులకు కోపం వచ్చినా.. ప్రభాస్ లేకుంటే టాప్ ఫైవ్ లో 5వ స్థానం, ఉంటే 6వ స్థానంలో ఉంటాడు ఎన్టీఆర్. నెంబర్స్ తో పనేంటీ.. మా హీరో గ్రేట్ యాక్టర్, డ్యాన్సర్ కదా అంటే ఏం చేయలేం. చేయాల్సిందల్లా.. ఎన్టీఆర్ కూడా తన రేంజ్ మారే కథలు, దర్శకులను ఎంచుకోవడం.. లేదంటే గ్రాఫ్ ఇలాగే నిలిచిపోతుందనేది నిజం.

One Comment

Post Comment