ఎన్టీఆర్ పై వచ్చిన వార్త నిజం కాదా ..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో పీక్స్ లో ఉన్నాడిప్పుడు. వరుసగా సినిమాలు చేయకపోయినా ఆర్ఆర్ఆర్ తో వచ్చిన ఖ్యాతి అంతర్జాతీయంగా అతన్ని క్రేజీ స్టార్ గా మార్చింది. ఏకంగా ఉత్తమ నటుడు కేటగిరీలో ఆస్కార్ బరిలో నిలిచాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ చిత్రం వచ్చే యేడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లాడు. ఓ రకంగా ఇది లాంగ్ ట్రిప్. న్యూ ఇయర్ కూడా విదేశాల్లోనే జరుపుకున్నాడు. అక్కడి నుంచి ఈ సోమవారం ఇండియాకు వస్తాడు అంటున్నారు. అయితే రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ విదేశాల నుంచి రాగానే చంద్రబాబు నాయుడు ఆయన్ని కలుస్తాడు అంటూ ఓ న్యూస్ వినిపిస్తోంది. బట్ ఇది నిజం కాదు అంటూ ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు కొట్టి పడేశాయి.


ఏపిలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కాస్త గందరగోళంగానే ఉందనేది నిజం. అధికార పక్షం బలంగా ఉంది. అదే టైమ్ లో ప్రజల్లో వ్యతిరేకత కూడా ఉంది. దీన్ని క్యాష్‌ చేసుకోవడానికి చంద్రబాబు తప్ప మరో బలమైన నేత కనిపించడం లేదు. ఆ బలం కోసమే ఆయన ఎన్టీఆర్ ను మీట్ అవబోతున్నాడు అంటూ ఓ వార్త వండి వదిలేశారు. బట్ ఇందులో నిజం లేదు. ఎన్టీఆర్- చంద్రబాబు మీటింగ్ పూర్తిగా అబద్ధం అని తేలింది. కాకపోతే ఎన్టీఆర్ రావడానికిఇది మాత్రం పక్కా టైమే అనేది ఆంధ్ర ప్రజల అభిప్రాయం. కానీ అతనికి మళ్లీ ఇప్పుడప్పుడే పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే ఆలోచన లేదు. అందుకే ఈ మధ్య కాలంలో తమ ఫ్యామిలికి సంబంధించి జరిగిన విషయాల్లోనూ ఆచితూచి స్పందించాడుతప్ప.. ఓ తెలుగు దేశం కార్యకర్తగా స్పందించలేదు. మొత్తంగా ఈ మీటింగ్ కేవలం రూమర్ గానే తేలిపోయింది.

Related Posts