విజయ్ దేవరకొండకు లైన్ క్లియర్.. ఒకేసారి రెండు సినిమాలు ..

ఒక పెద్ద సినిమా హీరో వల్ల హీరోయిన్.. హీరోయిన్ వల్ల హీరోలు బాధపడటం అత్యంత అరుదుగా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో అయితే అసలు పెద్దగా లేవు అనుకుంటోన్న టైమ్ లో వచ్చింది ఖుషీ. సమంత అనారోగ్య సమస్యల వల్ల ఈ మూవీ చాలాకాలం క్రితమే ఆగిపోయింది. ఆగిపోయే నాటికి మిగిలిన షూటింగ్ కేవలం 30శాతం మాత్రమే. ఆ పార్ట్ లోనే హీరో, హీరోయిన్ల కాంబినేషన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయట. దీంతో అనివార్యంగా విజయ్ దేవరకొండ కూడా ఆగిపోవాల్సి వచ్చింది. అసలే లైగర్ డిజాస్టర్ అయిన షాక్ లో ఉన్న అతనికి సమంత వల్ల మరింత సమస్య అయింది. ఫైనల్ గా విజయ్ దేవరకొండ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి.. ఒకేసారి రెండు సినిమాలు చేయబోతున్నాడు.


సినిమా ఇండస్ట్రీలో హిట్లూ, ఫ్లాపులు కామన్. కానీ యాటిట్యూడ్ మాత్రం ప్రధానం. ఈ విషయంలో విజయ్ దేవరకొండకు ముందు నుంచీ మైనస్ మార్కులే ఉన్నాయి. రౌడీ బాయ్స్ అంటూ తన ఫ్యాన్స్ ను సంబోధిస్తూ సరికొత్త ఇమేజ్ తెచ్చుకున్నాడు. అర్జున్, గీత గోవిందం హిట్స్ తో ఎక్కడికో వెళ్లిపోయాడు. కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే టాలీవుడ్ టాప్ ఫైవ్ లో చోటు సంపాదించుకుంటాడు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. పైగా ఈ రెండు సినిమాల హిట్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అతనిలో అతిగా కనిపించింది. చూసేవారికి ఓవర్ యాటిట్యూడ్ లా అనిపించింది. మరోవైపు చేస్తోన్న సినిమాలన్నీ వరుసగా పోయాయి.

చివరగా వచ్చిన లైగర్ అయితే పరువు తీసినంత పనిచేసింది. అప్పటి నుంచి కాస్త తగ్గాడు అనిపించుకుంటున్నాడు కానీ.. మళ్లీ హిట్స్ పడితే పాత కథే అనేది బాగా తెలిసిన వారి మాట. ఏదైతేనేం.. లైగర్ రిలీజ్ కు ముందే అతను సమంతతో ఖుషీ మూవీ మొదలుపెట్టాడు. కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. 70శాతం చిత్రీకరణ పూర్తయిన తర్వాత సమంత అనారోగ్యం బారిన పడింది. అప్పుడు ఆగిపోయిన షూటింగ్ మళ్లీ మొదలుకాలేదు. రీసెంట్ గా సమంత కోలుకుంది.

కానీ ఈ చిత్రాన్ని కాదని బాలీవుడ్ వెబ్ సిరీస్ కు వెళ్లింది. ఈ విషయంలో మూవీ టీమ్ అప్సెట్ అయింది. ఇటు విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరితో సినిమాకు కమిట్ అయ్యాడు. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఖుషీ మూవీ కోసం ఉన్న ఫిజిక్ ఈ పాత్రకూ ఫిట్ అవుతుంది. అంచేత ఇబ్బంది లేకుండా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అని నిర్ణయించుకున్నాడట. ఇక సమంత వచ్చే నెల నుంచి డేట్స్ ఇస్తా అని చెప్పిందంటున్నారు. ఈ గౌతమ్ సినిమా కూడా మార్చిలోనే మొదలవుతుంది. సో ఒకే సారి రెండు సినిమాలూ చేయడానికి రెడీ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. మరి ఈ రెండు సినిమాలైనా విజయం సాధిస్తాయా లేదా అనేది చూడాలి.

Related Posts