ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదగడం ఎంత కష్టమో ఎంతో టాలెంట్ ఉండీ వెనక్కి వెళ్లిపోయిన ఎందరో హీరోలను చూస్తే అర్థం అవుతుంది. హైలీ టాలెంటెడ్ అనిపించుకున్నా.. ఆ టాలెంట్ ను గుర్తించి అవకాశం ఇచ్చేవారూ ఉండాలి.

ఆ విషయంలో అదృష్టవంతుడు అనిపించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఎన్నో ఆటంకాలు ఫేస్ చేస్తూ చాలాకాలం క్రితం ప్రవీణ్‌ సత్తారు గుంటూరు టాకీస్ సినిమాతో మెరిశాడు. అంతకు ముందు నటించినా గుర్తింపు ఈ చిత్రంతోనే వచ్చింది.

మళ్లీ ఆ స్థాయి గుర్తింపు రావడానికి చాలా టైమ్ పట్టింది. కొంత గ్యాప్ తర్వాత కృష్ణఅండ్ హిజ్ లీలతో మెప్పించాడు. ఆ సినిమానే మనోడికి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఛాన్స్ వచ్చేలా చేసింది. అలా ఈ బ్యానర్ లో వచ్చిన డిజే టిల్లు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ హీరోల లిస్ట్ లోకి వచ్చేశాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ తో పాటు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశాడు.

ఇక సినిమా హిట్ అయిందన్న కారణమో లేక తనంతటి వాడు లేడు అనుకుంటున్నాడేమో కానీ సిద్ధు సీక్వెల్ కు వచ్చేసరికి చాలా శెకలు చేస్తున్నాడు అంటున్నారు. ఆ బ్యానర్ కూడా అతన్ని భరించలేనంతగా ఇబ్బంది పెడుతున్నాడు అనే టాక్ రోజూ ఇండస్ట్రలో వినిపిస్తోంది. కానీ ఓ ఖచ్చితమైన కారణంతోనే సిద్ధును వాళ్లు వదిలేశారని.. సినిమా చేసి ఇస్తే చాలు అని సైలెంట్ గా ఉన్నారు అంటున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడో మొదలైనా ఇంకా ముందుకు సాగడం లేదు. అందుకు కారణం కూడా ఈ సిద్ధునేట.


ఈ మూవీకి మొదటి దర్శకుడ విమల్ కృష్ణ.. కానీ సీక్వెల్ లో క్రియేటివ్ డిఫరెన్సెస్ తో అతను తప్పుకున్నాడు. అలాగే హీరోయిన్ గా శ్రీలలు అడిగితే తను నో చెప్పింది. తర్వాత అనుపమ పరమేశ్వరన్ ను తీసుకుంటే తను మధ్యలోనే వెళ్లిపోయింది.

ప్రస్తుతం మడోన్నా సెబాస్టియన్ అంటున్నారు. బట్.. ఎవరు వచ్చినా.. వారు భయపడటానికి కారణం సిద్ధు డిమాండ్స్ అంటున్నారు. ఫస్ట్ పార్ట్ లో నేహాశెట్టి సెడక్టివ్ గ్లామర్ చాలా పెద్ద ఎసెట్ అయింది. ఇప్పుడు కూడా ఆ రేంజ్ లో గ్లామర్ కురిపించాలి..

అలాగే “లిప్ లాక్స్”కూడా కావాలని పట్టు పడుతున్నాడట. రీసెంట్ గా అనుపమా పరమేశ్వరన్ రౌడీబాయ్స్ అనే సినిమాలో కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ లిప్ లాక్స్ చేసింది. ఇప్పుడు తనకూ అధర చుంబనాలు కావాలని సిద్ధు డిమాండ్ చేశాడట. ఆ కారణంగానే తను తప్పుకుందంటున్నారు. అలాగే కొత్తగా ఆడిషన్ చేసే అమ్మాయిలను సైతం ఇలాంటి డిమాండ్స్ చేస్తుండటం వల్లే డిజే టిల్లు సీక్వెల్ అంటేనే వారంతా భయపడుతున్నారట. అయినా ఒక్క గట్టి హిట్ పడితే ఇట్లుంటదా సిద్ధు. నిజంగా ఇండస్ట్రీలో నిలబడాలంటే ఇలాంటివి రాకుండా కదా చూసుకోవాలి అని ఫ్రెండ్స్ కూడా హితవు పలుకుతున్నారట.