క్లాసిక్ టైటానిక్ మళ్లీ విడుదలవుతోంది..

క్లాసిక్ మూవీస్ అని చాలా కొన్ని సినిమాల గురించే చెబుతాం. ఏ భాష అయినా.. అన్ని భాషల ఆడియన్స్ ను మెప్పిస్తే అది క్లాసిక్ అవుతుంది. ఒకప్పుడు మన శంకరాభరణం ఇండియాలోనే కాక ఇతర దేశాల ప్రేక్షకులను కూడా మెస్మరైజ్ చేసింది. అలా హాలీవుడ్ సినిమాలూ మనవారిని ఇన్ స్పైర్ చేసినవీ ఉన్నాయి. అయితే ప్రతి సినిమాకూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఫిదా చేసే ఏకైక దర్శకుడు జేమ్స్ కేమెరూన్. రీసెంట్ గా అవతార్ కు సీక్వెల్ తో వచ్చిన జేమ్స్ రూపొందించిన క్లాసిక్ టైటానిక్ ఇప్పుడు రీ రిలీజ్ కు రెడీ అవుతోంది.


టైటానిక్ .. 1997లో విడుదలైన చిత్రం. హాలీవుడ్ సినిమాలు తెలుగులో డబ్ అవడం ఎప్పుడూ ఉన్నదే. అయితే టైటానిక్ లాగా అన్ని వర్గాల ప్రేక్షకలను మెస్మరైజ్ చేసిన సినిమాలు అరుదుగా ఉంటాయి. అంతకు ముందు జురాసిక్ పార్క్ వచ్చినా.. ఈ మూవీ కాస్త డిఫరెంట్. నిజంగానే అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ అనే షిప్‌ ను తన కథా వస్తువుగా చేసుకుని జేమ్స్ కేమరూన్ ఓ అద్భుతమైన ప్రేమకథను చెప్పాడు. ఇది రెగ్యులర్ కమర్షియల్ కథే.

ఓ మాస్ కుర్రాడు. ఓ క్లాస్ అమ్మాయి. ఊహించని ఓ సందర్భంలో కలుసుకోవడం.. ఒకరికి ఒకరు నచ్చడం.. వీరి ప్రేమ సదరు పెద్ద ఇంటి వారికి నచ్చకపోవడం.. ఆ క్రమంలో ఆ షిప్ లోనే ఇద్దరి మధ్య సరస సల్లాపాలు.. అద్భుతమైన ప్రేమ భావనలతో నిండిపోతుంది. మరోవైపు ఆ మాస్ కుర్రాడితో తిరగొద్దని వారించే తల్లి.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి ఈ కుర్రాడిపై చ�