మాసే మంత్రమూ అంటున్న క్లాస్ హీరోలు

సినిమా తెరపై రాముడు మంచి బాలుడు లాంటి హీరోలకంటే పరశురాముడు పరాక్రమవంతుడు అంటేనే కాసులు రాలతాయి. ఇది సినిమా పుట్టిన దగ్గర్నుంచీ ఉన్న మాస్ సూత్రం. అందుకే కటౌట్ ను బట్టి క్లాస్ సినిమాలు చేసిన హీరోలు కూడా మాస్ ను మెప్పించాలని తంటాలు పడుతుంటారు. అలాగని ఇది అందరికీ సాధ్యం అయ్యేది కాదు. కొందరికి కోరుకోకుండానే మాస్ హీరో అనే ట్యాగ్ వస్తుంది. ఇంకొందరికి కోటి దండాలు పెట్టుకున్నా కుదరదు. అయినా ప్రయత్నాలు ఆపకూడదు కదా.. అందుకే మన సాఫ్ట్ స్టార్స్ అంతా ఇప్పుడుమాస్ మంత్రం జపిస్తున్నారు.


మాస్ హీరో అంటే చాలు.. క్లాస్ కూడా గంతులు వేస్తారు. బట్ క్లాస్ స్టార్స్ కు మాస్ నుంచి మరీ ఎక్కువ విజిల్స్ పడవు. మరి విజిల్స్ లేకుండా థియేటర్స్ చేసే సందడి పెద్దగా కిక్ ఇవ్వదు కదా. అందుకే ఈలలు గోలలతో పాటు మాస్ మూవీస్ చేస్తే ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతుంది. అందుకే ఇన్నాళ్లూ క్లాస్ ను అలరించిన నాని కూడా దసరా అంటూ మాస్ వేషం కట్టేశాడు. పక్కింటి కుర్రాడు టైప్ ఇమేజ్ ఉన్న నానిని దసరా మూవీ టీజర్ లో చూసి జనం జడుసుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఆ రేంజ్ లో ఉంది ఆ మాస్ గెటప్. ఇంకా చెబితే ఊరమాస్ అనొచ్చు. టీజర్ చూశాక అతను రంగస్థలంలో రామ్ చరణ్‌ ను, కెజీఎఫ్‌ లో యశ్ ను గుర్తు తెచ్చాడు అనేశారు. ఈ టాక్ సినిమాకూ వస్తే మనోడు మాస్ హీరో అయిపోయినట్టే. తర్వాత్తర్వాత కూడా ఇట్టాంటి సినిమాలు మరిన్ని చేసేయొచ్చు.


ఇక దేవదాస్ కనిపిస్తూ శైలజ లాంటి పిల్లలను పడేయడం వరకే పరిమితమైన రామ్ కూడా ఇస్మార్ట్ శంకర్ తో ఊరమాస్ ను మెప్పించి ఆ మాస్ క్లాస్ లోకి ఎంటర్ అయిపోయాడు. బట్ ఆ ఊపుకును కంటిన్యూ చేయడంలో ఈ వారియర్ చతికిలపడ్డాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేసిన రెడ్, వారియర్ రెండూ డిజాస్టర్స్ అయ్యాయి. అయినా ఇప్పుడు ఒంటిచేత్తో వందలమందిని కొట్టించే దర్శకుడు బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. మరి ఈ మూవీ రామ్ రేంజ్ ను మారుస్తుందా లేదా అనేది తేల్చివేస్తుంది.


ఇక కొన్ని రోజులు మాస్ అంటాడు.. ఆ వెంటనే క్లాస్ లోకి వెళ్లిపోతాడు నితిన్. అఫ్‌ కోర్స్ ఈ రెండు చోట్లా ఎప్పుడూ నిలకడగా విజయాలూ అందుకోలేదు. ఆ మధ్య ఇంక లవ్ స్టోరీస్ చేయను అన్నీ మాసే అన్నాడు. అలా అన్న తర్వాత వచ్చిన ‘మాచర్ల నియోజవర్గం’మాస్ ను మెప్పిస్తుంది అనుకుంటే బోల్తా పడిపోయింది. అయినా మాసే మంత్రమూ అంటూ ఇప్పుడు వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు ఇందులలో మనోడు లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాట్ట. మరి ఈ సారైనా మాస్ ఆడియన్స్ తో శెభాష్‌ అనిపించుకుంటాడా లేదా అనేది చూడాలి. అన్నట్టు మెగా హీరో వైష్ణవ్ తేజ కూడా మాస్ అవతారమెత్తనున్నాడు. శ్రీకాంత్ రెడ్డి అనే దర్శకుడితో మాస్ సినిమా చేస్తున్నాడు వైష్ణవ్. ఇలా కుర్ర హీరోలంతా మాస్ కథలు , మాస్ పాత్రల చుట్టూనే తిరుగుతూ ఆ కంటెంట్ మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాకపోతే ముందే సెప్పినట్టు ఇవి అందరికీ వర్కవుట్ అయ్యే యవ్వారాలు కాదు.

Related Posts