మరింత రంజుగా మారిన 2024 సంక్రాంతి పోటీ

కొన్ని కాంపిటీషన్స్ భలే కిక్ ఇస్తాయి. చూసేవారికే కాదు.. తీసిన వారికి సైతం ఓ రకమైన ఫీలింగ్ ను తెస్తాయి. అలాంటిదే వచ్చే సంక్రాంతికి రాబోతోన్న పోటీ. ఇంకా చాలా టైమ్ ఉన్నా.. ఇప్పటి నుంచే ఈ పోటీ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే కారణం.. ఆ పోటీ అలా ఉంది మరి. ఇక ఈ కాంపిటీషన్ ఇండస్ట్రీలోనే టాప్ ఫ్యామిలీస్ హీరోస్ మధ్య ఉంటే ఇంక చెప్పేదేముందీ.. ? మరి ఆ హీరోలెవరూ అనుకుంటున్నారు కదా..? వచ్చే సంక్రాంతి బరిలో ఇప్పటికే రామ్ చరణ్‌, అల్లు అర్జున్ వార్ డిక్లేర్అ యింది. ఇక లేటెస్ట్ గా బాలయ్య, పవన్ కళ్యాణ్‌ కూడా సంక్రాంతి రేస్ లోకి ఎంటర్ అయ్యారు. పొంగల్ వేదికగా పోటీకి సిద్ధమయ్యారు. మరి ఈ సినిమాలేంటీ అనేది చూద్దాం..


సంక్రాంతి అంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత పోటీ ఉంటుందో అందరికీ తెలుసు. ఏళ్లుగా ఈ పండగను టార్గెట్ చేసుకుని పెద్ద స్టార్లే బరిలోకి దిగుతుంటారు. యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలు కూడా ఈ సీజన్ లో హిట్ టాక్ తెచ్చుకుని గట్టెక్కుతాయి. ఇక ఈ సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య, చిరంజీవి సినిమాలు రికార్డులు క్రియేట్ చేశాయి. నిజానికి ఈ రెండు సినిమాల కంటెంట్స్ విషయంలో రివ్యూస్ అన్నీ యావరేజ్ అన్నా.. పండగ టైమ్ కలిసి రావడం వల్లే బ్లాక్ బస్టర్స్ గా డిక్లేర్ అయ్యాయి. ఇక 2024 సంక్రాంతికి మరింత స్ట్రాంగ్ కాంపిటీషన్ కనిపిస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్‌- శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రాన్ని నెక్ట్స్ సంక్రాంతి డేట్స్ ను ఫిక్స్ చేసుకున్నారు.

ఇక అదే టైమ్ కు అల్లు అర్జున్ – సుకుమార్ ల పుష్ప2 కూడా వస్తుందని తేల్చారు. దీంతో ఇది మెగా అల్లు హీరోల మధ్య వార్ అవుతుందీ అనుకుంటే లేటెస్ట్ గా మరో ఇద్దరు టాప్ స్టార్స్ ఈ బరిలోకి ఎంటర్ అయ్యారు. ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డిగా ఆకట్టుకున్న బాలయ్య వచ్చే సంక్రాంతి బరిలోనూ నిలుస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందే తన 108వ చిత్రాన్ని కూడా పొంగల్ కే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. దీంతో ఈ ఇద్దరు హీరోలతో బాలయ్య పోటీ పడబోతున్నాడు అనుకుంటోన్న టైమ్ లో ఈ వార్లోకి గబ్బర్ సింగ్ కూడా ఎంటర్ అయ్యాడు. యస్.. ఆ సంక్రాంతి టార్గెట్ గానే పవన్ కళ్యాణ్‌ కొత్త సినిమా ప్రారంభం అయింది. రన్ రాజా రన్, సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో రూపొందే చిత్రాన్ని 2024 సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

దే కాల్ హిట్ ఓజీ అనే క్యాప్షన్ తో మొదలైన ఈ చిత్రానికి ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్. ప్రస్తుతం ఓజి అనే అక్షరాలకు అర్థం కూడా అదే అని చెబుతున్నారు. సో.. ఇలా మెగా, అల్లు, నందమూరి ఫ్యామిలీ హీరోస్ తో 2024 సంక్రాంతి ఇప్పటి నుంచే హాట్ టాపిక్ గా మారబోతోందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. అయితే వీటిలో పవన్ కళ్యాణ్‌ సినిమా విషయంలో గ్యారెంటీ ఇవ్వలేము. ఎందుకంటే ఆయన షూటింగ్స్ కు సరిగా అటెండ్ కాడు కాబట్టి.. ఆలస్యం అయినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ అదే జరిగినా పోటీలో మాత్రం తేడా రాదు. ఏదేమైనా ఈ సినిమాలు, వాటి మధ్య పోటీ అనే మాటలు ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్నాయి. మరి ఈ వార్ లో విన్నర్ ఎవరో కానీ.. ఇది అభిమానుల మధ్య మాటల యుద్ధానికీ తెర తీస్తుందని చెప్పొచ్చు.

Related Posts