అది జూనియర్ ఎన్టీఆర్ కొన్న భూమి.. చంద్రబాబుకు సంబంధం లేదు

ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్స్ పెరిగినప్పుడు కొన్నిసార్లు తెలియకుండానో, తెలిసో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు సంబంధించి ఆయన పేరు తరచూ ప్రస్తావనలోకి వస్తుంది. కొన్నిసార్లు తెలుగుదేశంకు అనుకూలంగా ఉంటే.. మరికొన్నిసార్లు ప్రతికూలంగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఇంకొందరు ఎన్టీఆర్ ను వైసీపీకి అనుకూలం అని కూడా విమర్శలు చేస్తుంటారు. ఆ విమర్శలు రావడానికి ప్రధాన కారణం కొడాలి నాని. ఒకప్పుడు ఎన్టీఆర్ – కొడాలి నాని వద్దే ఉన్నాడు. ఎన్టీఆర్ కోసం నాని కొన్ని సినిమాలు కూడా నిర్మించాడు. అయితే కొన్నాళ్లుగా ఈ ఇద్దరూ ఓ సేఫ్ డిస్టన్స్ మెయిన్టేన్ చేస్తున్నారు. అయినా తాజాగా ఎన్టీఆర్ పేరు మళ్లీ గుడివాడ రాజకీయాల్లోకి ప్రస్తావనలోకి వచ్చింది. అందుకు కారణం చంద్రబాబు నాయుడు కావడం విశేషం.’


చంద్రబాబు నాయుడు తాజాగా గుడివాడలో పర్యటించాడు. ఈ సందర్భంగా నిమ్మకూరును తానే అభివృద్ధి చేశానని, అక్కడ భారీ ఎన్టీఆర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేశానని చెప్పాడు. దీనికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు నాని. నిమ్మకూరును అభివృద్ధి చేసింది స్వర్గీయ హరికృష్ణ అన్నాడు. అప్పట్లో రాజ్యసభ సభ్యుడుగా ఉన్న హరికృష్ణ ఎమ్.పి నిధుల నుంచి 14కోట్లు కేటాయించి నిమ్మకూరును అభివృద్ధి చేశాడు అని చెప్పాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా 25 ఎకరాల భూమిని కొని అక్కడ ఎన్టీఆర్ స్మృతివనం కోసం కేటాయించాడని చెప్పాడు.

అలాగే నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా జూనియర్ ఎన్టీఆరే ప్రారంభించాడని గుర్తు చేశాడు. అప్పట్లో ఆంధ్రావాల సినిమా ఆడియో ఫంక్షన్ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి 10లక్షల మందిని గ్యాదర్ చేశామని.. ఆ క్రౌడ్ లోనే ఎన్టీఆర్ నిమ్మకూరులో తాతగారి విగ్రహావిష్కరణ చేశాడు.. అంతే తప్ప నువ్వు(చంద్రబాబు) నిమ్మకూరు అభివృద్ధికి చేసిందేం లేదు. ఒకవేళ నువ్వేదైనా చేశావు అని ఒప్పుకుంటే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా’ అంటూ నాని ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు.
ఏదేమైనా ఈ సందర్భంగా ఇప్పటి వరకూ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ ఎన్టీఆర్ ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ ను మరోసారి గుర్తు చేశాడు కొడాలి నాని.

Related Posts