మా అమ్మాయి  ఫాతిమా విహహం ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని అన్వయ కన్వెన్షన్‌లో గ్రాండ్‌గా జరిగింది. వధూవరులను ఆశీర్వదించటానికి సినిమా రంగంతో పాటు రాజకీయ, వ్యాపార రంగంలోని వారు పాల్గొని వధువు ఫాతిమా వరుడు షహయాజ్‌లను నిండుమనసుతో ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి–సురేఖ,  యస్‌స్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కె.రాఘవేంద్రరావు, మురళీమోహన్,  బ్రహ్మానందం,  జయసుధ,  నాగార్జున–అమలా, వెంకటేశ్, అనిల్‌ రావిపూడి, బోయపాటి శ్రీను, రాజశేఖర్‌–జీవిత,

నిర్మాతలు అల్లు అరవింద్,  కె.యల్‌ నారాయణ, ఎస్‌ గోపాల్‌రెడ్డి, చోటా.కె.నాయుడు, తనికెళ్ల భరణి,  మంచు విష్ణు, లక్ష్మీ, తొట్టెంపూడి వేణు, ఆది సాయికుమార్, గౌతమ్‌ బ్రహ్మానందం,  

ఊహ, రోషన్,  ‘అల్లరి’ నరేశ్, రాజేశ్,  ప్రియదర్శి, పూరి జగన్నా«ద్‌ సతీమణి లావణ్య,  ఆకాశ్‌ పూరి, పవిత్రా పూరిలతో పాటు నాతో అనేక సినిమాల్లో నటించిన తోటి నటీనటులు 200మంది వరకు హాజరై వధూవరులను దీవించారు.

ప్రపంచ చాంపియన్‌ పి.వి సింధు తల్లితండ్రులతో సహా పెళ్లికి హాజరయ్యారు.   ముస్లిం సాంప్రదాయంలో కన్నులపండుగలా జరిగిన ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రోజా, అవంతి శ్రీనివాస్, మార్గాని భరత్, ప్రత్తిపాటి పుల్లారావు  తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

నా అతిధ్యాన్ని స్వీకరించి నూతన జంటను ఆశీర్వదించిన అతిరథ మహారధులందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా..
                              మీ ఆలీ..