తెలుగు సినిమాలు తేలిపోయాయి..

ఈ మధ్య కాలంలో వస్తోన్న చిన్న సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించడం లేదు. ఓ వైపు సమ్మర్ లో అసలుపెద్ద సినిమాలేం లేవు. ఈ అవకాశాన్ని వాడుకోవల్సిన చిన్న సినిమాలు మాత్రం అదే రొటీన్ స్టఫ్ తో కావాల్సినంతగా ఇరిటేట్ చేస్తున్నాయి. ఈ శుక్రవారం వచ్చిన తెలుగు చిత్రాలు కూడా నిరుత్సాహపరిచాయి. ముఖ్యంగా నానా హడావిడీ చేస్తూ వచ్చిన మళ్లీ పెళ్లి కావాల్సినంతగా ఇబ్బంది పెట్టింది.

నరేష్ తను గొప్ప సచ్ఛీలుడను అని చెప్పుకోవడానికి.. ఇంకా చెబితే తనకు తానుగా డబ్బా కొట్టుకోవడానికే ఈ చిత్రాన్ని రూపొందించినట్టు అర్థమైంది. అంతేకాక తమది అత్యంత పవిత్రమైన ప్రేమ అని చెప్పాలనుకున్నాడు. ఓ రకంగా నరేష్‌- పవిత్రల బయోపిక్ లాంటిది అని చెప్పే అవకాశం ఉన్న ఈ మూవీ పూర్తిగా ఒన్ సైడెడ్ గా ఉండటంతో ఆడియన్స్ కు తలనొప్పి తప్ప ఎంటర్టైన్మెంట్ దొరకలేదు.


ప్రమోషన్స్ లో కొత్త పంథాను పరిచయం చేస్తూ దాదాపు ఇండస్ట్రీలోని చాలామందిని ప్రమోషన్స్ కోసం వాడుకుని యూత్ లో కాస్త క్రేజ్ తెచ్చుకున్న సినిమా మేమ్ ఫేమస్. సుమంత్ ప్రభాస్ అనే కుర్రాడు హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని చాయ్ బిస్కట్ వాళ్లు నిర్మించారు. అయితే ఫస్ట్ హా�