Thamanna : బాలయ్య సినిమాకు భారీగా డిమాండ్ చేసిన తమన్నా

ఏజ్ బార్ అయిన హీరోయిన్లు, ఆఫర్స్ లేని భామలే ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ తో ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు డిమాండ్ లో ఉన్న బ్యూటీస్ తోనే ఐటమ్ సాంగ్స్ చేయిస్తున్నారు మన మేకర్స్. దీంతో ఒక్క పాటకే వారికి దాదాపు ఒక సినిమాకు ఇచ్చినంత రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వగలిగేవాళ్లు ఓకే అంటున్నారు. లేదంటే ఎవరికీ పెద్దగా తెలియని వాళ్లతోనే ఈ స్పెషల్ సాంగ్స్ చేయిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన ఎఫ్‌3 చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం పూజాహెగ్డే.. దిల్ రాజు వద్ద భారీగానే వసూలు చేసిందనే టాక్ ఉంది.

ఇప్పుడు తమన్న కూడా అదే చేస్తోంది. చేయడమే కాదు.. సాధించింది కూడా అంటున్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడికి ఓ సెంటిమెంట్ ఉంది. తన ముందు సినిమా హీరోయిన్ తో నెక్ట్స్ మూవీలో స్పెషల్ సాంగ్ చేయిస్తాడు. అలా ఎఫ్2 తర్వాత సరిలేరు నీకెవ్వరులో తమన్నాతో ఐటమ్ సాంగ్ చేయించాడు.

ఇప్పుడుమరోసారి అమ్మడిని బాలయ్య సినిమాలో ఓ పాట కోసం అప్రోచ్ అవమని నిర్మాతలకు చెప్పాడట.అనిల్, బాలయ్య సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీంతో నిర్మాతలు కూడా వెంటనే తమన్నాను అడిగారు. బట్ తను చెప్పిన ఫిగర్ కు నిర్మాతల కళ్లు తిరిగాయట. ఆ రేంజ్ లో డిమాండ్ చేసిందీ అంటున్నారు. పైగా అమ్మడికి ఇప్పుడు ఆఫర్స్ కూడా పెద్దగా లేవు. వరుసగా హిట్సూ లేవు. అయినా ఈ ఫిగర్ అయితేనే నా ఫిగర్ మీ సినిమాలో కనిపిస్తుంది ఖచ్చితంగా చెప్పిందట.

పెద్ద సినిమా.. క్రేజీ కాంబినేషన్.. కావడంతో నిర్మాతలు కూడా కామ్ గా ఆమె చెప్పిన అమౌంట్ కు ఓకే చెప్పారట. అన్నట్టు.. తను కావాల్సిందే అని.. అనిల్ కూడా పట్టుబట్టాడు అనే టాక్ కూడా ఉంది. ఇండస్ట్రీలో ఇట్టాంటి టాకులు కామనే కానీ.. అస్సలు ఫామ్ లో లేకపోయినా అంత కాన్ఫిడెంట్ గా తమన్నా అడిగిన ఫిగర్ ఉంది చూశారు.. అది హాట్ టాపిక్ అయింది అంటున్నారు. ఇంతకీ తను ఎంత అడిగిందో చెప్పమంటే నిర్మాతలు చెప్పడం లేదు. కానీ.. చాలా పెద్ద మొత్తమే అని మాత్రం చెబుతున్నారట

Related Posts