Manchu vishnu : కరాటే కళ్యాణిపై సస్పెన్షన్.. రైటా.. రాంగా..?

కెరీర్ ఆరంభంలోనే బి గ్రేడ్ తరహా పాత్రల్లో కనిపించిన నటి కరాటే కళ్యాణి. అప్పట్లో క్లీవేజ్ షోస్ తో కొంత పాపులారిటీ తెచ్చుకుంది. తర్వాత కృష్ణ, మిరపకాయ్ చిత్రాల్లో చేసిన పాత్రలతో కాస్త ఫేమ్ అయింది. మామూలుగా భాగవత కళాకారిణి అయిన కళ్యాణి.. ఆ ఇమేజ్ కు భిన్నమైన పాత్రలు వెండితెరపై పోషించింది. అయితే కొన్నాళ్లుగా ఈవిడి అన్ని వివాదాల్లోనూ హెడ్ పెట్టేస్తోంది. అవసరం ఉన్నా లేకపోయినా.. అన్నిట్లోకీ దూరిపోతోంది. దానికి కాస్త మసాలా దట్టించి మతం రంగు కూడా పూసేసి ఒక వర్గం అభిమానం కోసం ప్రయత్నాలు చేసింది.

అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టుగా .. కళ్యాణి మతం ముసుగు కూడా స్వార్థమే అని తర్వాత చాలామందికి అర్థమైంది. మరోవైపు సినిమాలు కూడా తగ్గడంతో ఇదే వ్యాపకంగా నిత్యం వివాదాలతో కనిపిస్తోంది. ఇక తాజాగా ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించిన రగడ మొదలుపెట్టింది. ఖమ్మంలోని లకారం పార్క్ వద్ద 56 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకున్నారు.

అయితే ఈ విగ్రహం శ్రీ కృష్ణుడిది. దీంతో ఒక నటుడుని దేవుడు బొమ్మగా ఎలా ఆవిష్కరిస్తారు.. ఇది మా “యాదవుల”ను అవమానించడమే అంటూ కొత్త పాట ఎత్తుకుంది కళ్యాణి. అఫ్‌ కోర్స్ అంతకు ముందే చాలామంది ఈ గొడవ స్టార్ట్ చేశారు. అయితే సినిమా పరిశ్రమలో ఉండీ.. ఎన్టీఆర్ విగ్రహం వద్దు అనడం సహజంగానే చాలామందికి నచ్చలేదు. దీంతో కొన్ని రోజుల క్రితమే మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు షోకాస్ నోటీస్ జారీ చేశాడు.

దీనిపై వివరణ అడిగాడు. రీసెంట్ గా కళ్యాణి తన వివరణ ఇచ్చుకుందట. బట్ కానీ కమిటీ ‘శాటిస్ ఫై’కాలేదు. దీంతో ఆమెను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశారు. ఇంత వరకూ ఓకే అనుకున్నా.. ఆమె సస్పెన్షన్ న్యాయమైనదేనా అని ఆలోచిస్తే ఖచ్చితంగా కాదు అనే చెప్పాలి.


నిజానికి ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆ రూపంతో ఆవిష్కరించొద్దు అని హై కోర్ట్ ఉత్తర్వులు ఇచ్చింది. కళ్యాణిని ఈ విషయంలో సస్పెండ్ చేయడం అంటే హై కోర్ట్ ఉత్తర్వులతో మాకేం పనిలేదు అని సాక్షాత్తూ ద గ్రేట్ మా అధ్యక్షుడు ఒప్పుకున్నట్టే కదా.. అయినా తను ఓ వర్గం కోసం ప్రయత్నాలు చేసింది. దానికి కోర్ట్ మద్ధతు కూడా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వ్యతిరేకంగా పనిచేసిందని ఎలా అంటారు. ఇంకా చెబితే ఆమె ఎన్టీఆర్ ను వ్యతిరేకించలేదు. ఆయన్ని అవమానించలేదు. దేవుడు రూపంలోఉన్న విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని మాత్రమే వ్యతిరేకించింది. ఇది ఆర్టిస్టుల ఐకమత్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది.. ఇలా చెప్పుకుంటూ పోతే కరాటే కళ్యాణిపై సస్పెన్షన్ అనేది ఖచ్చితంగా ఆమోదనీయం కాదు. అలాగని ఆమె చేసే అతిని కూడా ఇక్కడ సమర్థించడం లేదు.

Related Posts