కొత్త తరం దర్శకులంటే సరికొత్త కథలతో వస్తున్నారు. వైవిధ్యమైన కథనంతో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మరో కొత్త దర్శకుడు శ్రీను ఊర సారథ్యంలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది.

కథాబలం ఉన్న సినిమాలను ఇష్టపడే నైజం ఉన్న లెక్కల మహేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమానికి సీనియర్ దర్శకుడు వి సముద్ర నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, బాలబ్రహ్మచారి, మన్నెపల్లి అప్పారావు, శ్రీ లక్ష్మి, జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ముఖ్య అతిథుల చేతుల మీదుగా పూర్తి స్క్రిప్ట్ ను దర్శకుడు ఊర శ్రీనుకు అందచేయడం జరిగింది. ఈ నెల 25 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోందని తెలిపారు.

రెగ్యులర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కు భిన్నమైన కథ, కథనాలతో వస్తోన్న చిత్రం ఇది అని దర్శకుడు శ్రీను, నిర్మాత మహేంద్ర రెడ్డి తెలియజేశారు. హీరో హీరోయిన్లుగా ఓ కొత్త జంట పరచయం కాబోతోన్న ఈ చిత్రంలో నటించే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అని చెప్పారు.