సూర్య కూడా తప్పుకున్నాడు..ఇక ఆ దర్శకుడి పని అయిపోయినట్టేనా..?

ఎంత క్రియేటివిటీ ఉన్నా.. కాస్త పట్టు విడుపూ కూడా ఉండాలి అంటారు. ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో మోనార్క్ లా ఉంటే అన్నిసార్లూ వర్కవుట్ కాదు. ముఖ్యంగా విజయాలు లేనప్పుడు. ఈ విషయంలో దర్శకుడు బాలలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఇంతకీ బాల అంటే గుర్తుంది కదా. రెండు దశాబ్దాల క్రితం సేతు, నందా, శివపుత్రుడు, నేనే దేవుణ్ని, వాడు వీడు వంటి వైవిధ్యమైన రా మూవీస్ తో ఒకప్పుడు ఊపేశాడు. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్స్ కూడా అందుకున్నాడు.

బాల సినిమా అంటే ఊరమాస్ గా ఉంటుంది. చాలా రా గా ఉంటుంది. సినిమాటిక్ మెలోడ్రామా మోతాదు మించి కనిపిస్తుంది. ఇంకా చెబితే అరవ అతి బాగా ఉంటుంది. అయినా ఆ దశలో అతని సినిమాలు కొత్తగా అనిపించాయి. అటు కమర్షియల్ గానూ సూపర్ హిట్‌స్ గా నిలిచాయి. అయితే మారుతున్న కాలానికి, ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా బాల మారలేదు. టెక్నాలజీ పెరిగి, కొత్త తరం ప్రేక్షకులు వచ్చిన తర్వాత కూడా పరదేశి, తారై తపట్టై, నాచియార్ అనే మూవీస్ తో తన అభిరుచినే చూపించాడు. దీంతో ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద పోయియి.

అయితే తనకు హీరోగా తిరుగులేని క్రేజ్ ఇచ్చిన దర్శకుడు కావడంతో తన కొడుకును కూడా హీరోగా నిలబెట్టే అవకాశం బాలకు ఇచ్చాడు హీరో విక్రమ్. తెలుగులో పాథ్ బ్రేకింగ్ మూవీ అనిపించుకున్న అర్జున్ రెడ్డిని అక్కడ ఆయన రీమేక్ చేస్తే విక్రమ్ కే అస్సలు నచ్చలేదు. కట్ చేస్తే ప్రాజెక్ట్ ను ఆపేసి తెలుగు దర్శకుడు గిరీశయ్యతో మళ్లీ మొత్తం సినిమా చేయించాడు.


ఇక కెరీర్ ఆరంభంలో తనకు కమర్సియల్ హిట్స్ ఇచ్చాడనే కృతజ్ఞతతో హీరో సూర్య మరోసారి ఆయన దర్శకత్వంలో చేయడానికి ముందుకు వచ్చాడు. వానమగన్ అనే టైటిల్ తో చాలా రోజుల క్రితమే ప్రారంభమైందీ చిత్రం. కృతిశెట్టిన ఏరి కోరి మరీ హీరోయిన్ గా తీసుకున్నారు కూడా. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి లేటెస్ట్ గా సూర్య తప్పుకున్నాడు అనే టాక్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు బాల తనకు చెప్పిన కథలో చిత్రీకరణ మొదలుపెట్టిన తర్వాత విపరీతమైన మార్పులు చేశాడట.

తీరా చూస్తే అవి తన ఇమేజ్ కే కాదు.. ఓ మీడియం రేంజ్ హీరో ఇమేజ్ కు కూడా సరిపోవడం లేదు. ఇదే విషయం బాలకు చెబితే.. ఇది తన స్క్రిప్ట్ ఇలాగే ఉంటుంది అని చెప్పాడట. అంతే కాదు.. కావాలంటే నువ్వు తప్పుకోవచ్చు.. నేనేం అనుకోను అని కూడా అన్నాడట. దీంతో మొదట్నుంచీ ఇలాంటి వివాదాలకు చాలా దూరంగా ఉండే సూర్య కామ్ గా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు అంటున్నారు. నిజానికి సూర్య లాంటి హీరో ఇప్పుడు బాలకు డేట్స్ ఇవ్వడం చాలా పెద్ద విషయం.

దాన్ని నిలబెట్టుకోవడంలో కూడా విఫలమయ్యాడు అంటే.. ఇక దర్శకుడుగా బాల కథ ముగిసినట్టే అని కోలీవుడ్ లోనే చెప్పుకుంటున్నారు. ఏదేమైనా గతంలో తెలుగులోనూ క్రియేటివ్ డైరెక్టర్ అనిపించుకున్న ఓ దర్శకుడు ఇలాగే మోనార్క్ లా వ్యవహరించాడు. కట్ చేస్తే వరుస డిజాస్టర్స్ ఫేస్ చేశాడు. ఇప్పుడు ఓ రీమేక్ చేస్తూ రిలీజ్ అవుతుందా లేదా అనే డౌట్స్ లో ఉండిపోయాడు.

Related Posts