సర్ ప్రైజింగ్.. నానితో శ్రుతి హాసన్

దసరాతో ధమాకా హిట్ కొట్టిన నాని మంచి జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం తన కెరీర్ లో 30వ సినిమా చేస్తున్నాడు. శౌర్యు అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతోన్న ఈ మూవీలో నాని సరసన సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. నాని ఓ పాపకు తండ్రిగా కనిపించబోతున్నాడు. ఆల్రెడీ కొన్నాళ్ల క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది.

అయితే సర్ ప్రైజింగ్ గా ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కూడా నటించబోతోంది. తెలుగులో ఈ యేడాది వీర సింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న శ్రుతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ మూవీలో నటిస్తోంది.

అలాంటి తను సడెన్ గా నాని తో కలిసి నటించబోతుండటంతో చాలామంది ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంటే నాని తక్కువ అని కాదు.. ఇంత క్రేజీ కాంబినేషన్ గురించి చిన్న వార్త కూడా లీక్ కాకుండా మూవీ టీమ్ బలే మ్యానేజ్ చేసిందే అనేదే ఆశ్చర్యానికి కారణం.


మొన్నటి వరకూ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ రీసెంట్ గానే గోవా షెడ్యూల్ కు షిఫ్ట్ అయింది. ఈ షెడ్యూల్ నుంచే శ్రుతి హాసన్ జాయిన్ కాబోతోందని అఫీషియల్ గా చెప్పారు. మామూలుగా నాని- మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ నే కొత్తగా చూశారు జనం. ఇప్పుడీ సీనియర్ బ్యూటీతో కూడా నానితో జత కట్టడం మరింత సర్ ప్రైజింగ్ గా ఉందంటున్నారు.

అయితే ఈ సినిమాలో శ్రుతి హాసన్ నానికి మరో జోడీగా నటిస్తోందా లేక తనది ఏమైనా ప్రత్యేక పాత్రా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు ఈ చిత్రం తమిళ్ బ్లాక్ బస్టర్ డాడాకు రీమేక్ అని కూడా కొంతమంది చెబుతున్నారు. అయితే ఆ సినిమాలో రెండో హీరోయిన్ ఉండదు. సో.. శ్రుతి హాసన్ ఎంట్రీతో ఇది తమిళ్ మూవీకి రీమేక్ కాదు అని కూడా తేలిపోయినట్టే.

Related Posts