సర్ ప్రైజ్..ఓ.జి లో పవన్ కళ్యాణ్ కొడుకు కూడా..

స్టార్ హీరోల వారసులు ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడతారా అని వారి అభిమానులు ఎదురుచూస్తుంటారు. అలాంటి వారసుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ – రేణూ దేశాయ్ ల మొదటి సంతానమైన అకిరా నందన్ తండ్రిలాగే మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నాడు.

చిన్నప్పటి నుంచి మార్షల్ఆర్ట్స్ తో పాటు మ్యూజిక్ లో కూడా శిక్షణ తీసుకున్నాడు. రీసెంట్ గా ఓ షార్ట్ ఫిల్మ్ కు సంగీతం కూడా చేశాడు. అయితే అతన్ని పవన్ వారసుడుగా వెండితెరపై చూడాలనేది ఫ్యాన్స్ కోరిక. వారి కోరిక చివరికి నెరవేరబోతోంది. అది కూడా ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలోనే అకిరా నందన్ పరిచయం కాబోతున్నాడు.

ప్రస్తుతం చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న మోస్ట్ అవెయిటెడ్ పవన్ కళ్యాణ్ మూవీ ‘ఓ.జి’ లో పవన్ భిన్నమైన వయసుల్లో కనిపించబోతున్నాడట. అందులో టీనేజ్ గెటప్ కూడా ఒకటుంటుందని టాక్. ఆ పాత్ర కోసం పవన్ మేకోవర్ మార్చడం కంటే అకిరా నందన్ ను తీసుకుంటే బెటర్ అనే ఆలోచన వచ్చిందని చెబుతున్నారు.

ఇది ఎలాగూ తండ్రి సినిమా కాబట్టి అటు రేణూ దేశాయ్ కూడా నో చెప్పే ఛాన్స్ లేదు. సో.. అకిరా తెరగేట్రంతోనే తండ్రి సినిమాలో కనిపించబోతున్నాడు అనే టాక్ టాలీవుడ్ లో ఓ రేంజ్ లో వినిపిస్తోంది.
ఇక ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ కు ఇంగ్లీష్ షార్ట్ ఫామ్ లో ఓజి అనే టైటిల్ తో వస్తోన్న ఈ చిత్రానికి రన్ రాజా రన్, సాహో ఫేమ్ సుజిత్ దర్శకుడు.

ప్రస్తుతం మహరాష్ట్రలోని మహాబలేశ్వర్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. మరోవైపు హరీశ్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రం కూడా ఒకేసారి షూటింగ్ జరుపుకుటోంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ సినిమాలో అకిరా నందన్ ఎంట్రీ అనే టాక్ మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారిందనే చెప్పాలి.

Related Posts