సందీప్ కిషన్ మైఖేల్ ఫిబ్రవరి 3న విడుదల

ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ మొదటి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పోస్టర్లు, టీజర్, ఇటీవల విడుదలైన ‘నువ్వుంటే చాలు’ ఫస్ట్ సింగిల్ చాలా క్యూరీయాసిటీని పెంచాయి. సామ్ సి ఎస్ సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ తన సోల్ ఫుల్ సింగింగ్ తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. ఈ పాట మ్యూజిక్ చార్ట్ లలో అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.

మైఖేల్ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా అన్ని సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. అనౌన్స్మెంట్ పోస్టర్ లో ప్రధాన నటీనటులందరినీ రా, రస్టిక్ లుక్స్ లో ప్రజంట్ చేశారు. సందీప్ కిషన్ ముఖంపై గాయాలతో కనిపిస్తుండగా, విజయ్ సేతుపతి సిగరెట్ వెలిగిస్తూ కనిపించారు. గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్ లు కూడా పోస్టర్ లో కనిపించారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది.

ఈ చిత్రాన్ని మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పి తో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇది ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు ల జాయింట్ ప్రొడక్షన్ వెంచర్. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు.

స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కిరణ్ కౌశిక్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి డైలాగ్స్ అందిస్తున్నారు.

తారాగణం: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్కుమార్, వరుణ్ సందేశ్,అనసూయ భరద్వాజ్ తదితరులు

Related Posts