Sudigaali sudheer : గోట్ లా మారిన సుడిగాలి సుధీర్

మల్టీ టాలెంటెడ్ యాక్టర్ సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మొదట జబర్దస్త్(Jabardast) ద్వారా వచ్చిన ఆ క్రేజ్ తోనే అతను హీరోగానూ మారాడు. గతంలో చేసిన రెండు సినిమాలు సాఫ్ట్ వేర్ సుధీర్(Software Sudheer), 3మంకీస్(3 Monkeys) యావరేజ్ అనిపించుకున్నా రీసెంట్ గా వచ్చిన గాలోడు(Galodu) మాత్రం కమర్షియల్ గా మంచి విజయమే సాధించింది.

ప్రస్తుతం ఆ ఊపుతోనే నాలుగో సినిమాతో హీరోగా వస్తున్నాడు సుధీర్. సుధీర్ బర్త్ డే సందర్భంగా ఆల్రెడీ షూటింగ్ జరుగుతోన్న ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు.
సుడిగాలి సుధీర్ నాలుగో సినిమా అనే వర్కింగ్ టైటిల్ తో వినిపించిన ఈ మూవీకి ‘గోట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గోట్(G.O.A.T) అంటే తెలుగులో మేక అని అర్థం. కానీ దీన్ని ఇంగ్లీష్ లో “గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్ టైమ్” అనే వాక్యాన్ని షార్ట్ గా మార్చి వెరైటీగా గోట్ అంటున్నారు.

దీంతో పాటు విడుదల చేసిన పోస్టర్ కూడా అతని ఇమేజ్ కు తగ్గట్టుగా కనిపిస్తోంది. గజ లవ్స్ బిందు, కే రాజు – పల్లవి, ఛాలెంజ్ యాక్సెప్టెడ్ వంటి పదాలు కూడా పోస్టర్ లో ఆకట్టుకుంటున్నాయి. నోట్లో సిగరెట్ తో సుధీర్ కనిపిస్తున్నాడు. మొత్తంగా సుడిగాలి సుధీర్ నాలుగో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఆకట్టుకునేలానే కనిపిస్తున్నాయి. మరి గాలోడు తర్వాత జి అనే లెటర్ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తోన్న ఈ గోట్ ఎలా ఉంటుందో…

Related Posts