Srinivas : శ్రీనివాస్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడే..?

తెలుగు నుంచి బాలీవుడ్ కు వెళ్లి సక్సెస్ అయిన హీరోలు లేరనే చెప్పాలి. అప్పట్లో మెగాస్టార్(Megastar) నుంచి వెంకటేష్(Venkatesh), నాగార్జున (Nagarjuna)కూడా బాలీవుడ్ లో స్టార్డమ్ తెచ్చుకోవాలని ప్రయత్నించారు. అప్పటికి కొన్ని ప్రయత్నాలను వాళ్లు మెచ్చుకున్నారు కానీ.. మన హీరోలను యాక్సెప్ట్ చేయలేదు. దీంతో బాలీవుడ్ ఆశలువదులుకుని మళ్లీ తెలుగులోనే నటించారు. ఈ తరలో రామ్ చరణ్‌(Ram Charan) కూడా తుఫాన్(Toofan) సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో మళ్లీ ఆ వైపు చూడలేదు.

చరణ్‌ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) ఛత్రపతి(Chatrapathi) రీమేక్ తో బాలీవుడ్(Bollywood) డెబ్యూ ఇచ్చాడు. అక్కడ అతనికి డబ్బింగ్ మార్కెట్ రూపంలో భారీ ఇమేజ్ కూడా ఉంది. ఆ ఇమేజ్ ఈ చిత్రానికి ఓపెనింగ్స్ తెస్తుందని బలంగా నమ్మాడు బెల్లంకొండ. మరోవైపు ప్రస్తుతం ప్యాన్ ఇండియన్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ ఉన్న ప్రభాస్(Prabhas) సినిమాకు రీమేక్ అనే ప్రచారం కూడా ఈ ఛత్రపతికి కలిసొచ్చింది. శ్రీనివాస్ ను తెలుగులో హీరోగా లాంచ్ చేసిన వివి వినాయకే(VV Vinayak) బాలీవుడ్ లోనూ పరిచయం చేశాడు.


కొన్నాళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు తెలుగు హీరోలకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కు తోడు సినిమా విజయం సాధిస్తే బెల్లంకొండ శ్రీనివాస్ కు బాలీవుడ్ లో మంచి ప్లాట్ ఫామ్ దొరికి ఉండేది. బట్ఈ చిత్రానికి ఓపెనింగ్స్ ఫర్వాలేదు అనిపించుకున్నాయి కానీ.. రిజల్ట్ మాత్రం రాలేదు.
ఛత్రపతిని రొటీన్ మాస్ ఎంటర్టైనర్ గా తేల్చారు నార్త్ ఆడియన్స్. తెలుగు స్టేట్స్ లోనూ రిలీజ్ అయింది కానీ తెలుగులో కాదు. కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే విడుదల చేశారు. కాకపోతే చిత్రానికి మంచి హైప్ తెచ్చే విషయంలో మూవీ టీమ్ సరైన ప్రణాళికలు చేయలేదు అనేది నిజం.

కేవలం బెల్లంకొండ శ్రీనివాస్ డబ్బింగ్ మార్కెట్ క్రేజ్ తో పాటు ప్రభాస్ సినిమా రీమేక్ అనే రెండు ట్యాగ్స్ తోనే వెళ్లడంతో ఫలితం దెబ్బకొట్టింది. దీనికి తోడు దర్శకుడు వినాయక్ కూడా కొత్త తరం ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేయించడంలో విఫలం అయ్యాడు. ఇంకా పదిహేనేళ్ల క్రితం మాస్ కంటెంట్ తోనే రావడంతో హిందీ ఛత్రపతికి ఫ్లాప్ టాక్ వచ్చేసింది. కాకపోతే ఈ తరహా ఊరమాస్ ఎంటర్టైనర్స్ ను చూసేందుకు సెపరేట్ ఆడియన్స్ ఉంటారు. వారి వల్ల ఈ వీకెండ్ కు ఏమైనా కలక్షన్స్ యాడ్ అవుతాయేమో చూడాలి.

Related Posts