నెలకో సినిమాతో వస్తోన్న శ్రీలీల

‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన శ్రీలీల రేంజ్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒకవైపు మీడియం రేంజ్ హీరోలతో నటిస్తూనే.. మరోవైపు స్టార్ హీరోస్ కి కూడా మెయిన్ ఆప్షన్ గా మారింది. సెప్టెంబర్ లో ‘స్కంద‘ చిత్రంతో వచ్చిన శ్రీలీల.. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలలోనూ వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. ఈ నాలుగు నెలల్లో నాలుగు సినిమాలతో ఆడియన్స్ అలరించడానికి సిద్ధమైంది.

అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి‘ సినిమాతో వస్తోంది శ్రీలీల. దసరా కానుకగా విడుదలవుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ కూతురుగా నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రలో శ్రీలీల కనిపించబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ లో శ్రీలీల కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు మేకర్స్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నవంబర్ లో ‘ఆదికేశవ‘తో ఆడియన్స్ ముందుకు వస్తోంది శ్రీలీల. మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ కి జోడీగా ఈ సినిమాలో శ్రీలీల కనిపించనుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ రెడ్డి దర్శకుడు. ఇప్పటివరకూ లవర్ బాయ్ గా కనిపించిన వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో యాక్షన్ కూడా ఇరగదీయబోతున్నట్టు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. నవంబర్ 10న ‘ఆదికేశవ‘ విడుదలకు ముస్తాబవుతోంది.

శ్రీలీల హీరోయిన్ గా నటించిన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‘ సినిమా డిసెంబర్ 8న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. నితిన్ హీరోగా రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రమిది. నితిన్ ఓన్ ప్రొడక్షన్ శ్రేష్ట్ మూవీస్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ‘డేంజర్ పిల్లా‘ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ పాటలో నితిన్, శ్రీలీల పెయిర్ ఆకట్టుకుంటుంది.

ఇక జనవరిలో సంక్రాంతి కానుకగా వచ్చేస్తోంది ది మోస్ట్ అవెయిటింగ్ ‘గుంటూరు కారం‘. సూపర్ స్టార్ మహేష్ బాబు కి జోడీగా ఈ సినిమాలో శ్రీలీల కనిపించబోతుంది. అసలు ‘గుంటూరు కారం‘లో శ్రీలీల సెకండ్ లీడ్ అనుకున్నారు.

.. పూజా హెగ్డే తప్పుకోవడంతో ఆ ప్లేస్ ను శ్రీలీల రీప్లేస్ చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ‘గుంటూరు కారం‘ జనవరి 12న విడుదలవుతోంది.

Related Posts