Latest Movies Tollywood

శ్రీకాంత్‌ అడ్డాల జిరాక్స్‌ కాపీ సెంటర్‌

విక్టరీ వెంకటేష్‌ నటించిన తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఇది తమిళంలో విజయం సాధించిన అసురన్ మూవీకి రీమేక్ కావడంతో.. తెలుగులో ఈ సినిమాని ఎలా తీసారో అనేది ఆసక్తిగా మారింది. అందులోని వెంకీ హీరో.. సున్నితమైన కథలను తెర పై అద్భుతంగా ఆవిష్కించే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నెల 20న నారప్ప డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది.

వెంకీ తన పాత్రకు న్యాయం చేశాడు అద్భుతంగా నటించాడు అనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విషయానికి వస్తే.. మక్కీకి మక్కీ దించేశాడు. ఎంతలా అంటే.. ఇల్లు, వాకిలి, గొడ్డు, గోదా, మట్టి, చెట్టు అన్నీ కాపీ కొట్టారు. మాటలు కూడా అవే… భాష మారిందంతే. అయితే.. ఎక్కడో ఒరిజినల్లో ఉన్న బిగువు మిస్సయ్యింది. ఫస్టాఫ్ గ్రిప్పింగ్ గా ఉన్నా సెకండాఫ్ లో కథ చివరకికొచ్చేకొద్దీ ప్రేక్షకులు సహనపరీక్ష రాయాల్సుంటుంది. క్లైమాక్స్ ప్రెడిక్టిబుల్గా ఉండడంతో పాటు ఒంటిచేత్తో వెంకటేష్ చేసే కమెర్షియల్ తరహా క్లైమాక్స్ ఫైటింగ్ అంత వరకూ చూస్తున్న మూడ్ ని దెబ్బతీస్తుంది.

తండ్రీకొడుకులు పొట్టల్లో అంత లావు బరిసెలు దిగిపోయినా వాళ్ళు బతికి బట్టకట్టడం ఇప్పటికీ మన సినిమాల్లో కనిపించడం నవ్వొస్తుంది. ఇలాంటి చిన్న చిన్న తప్పులే సినిమాకి తిప్పలు తెచ్చిపెడతాయి. కొంత కాకపోతే కొంత అయినా మార్పులు చేస్తాడనుకుంటే.. అడ్డాల అసురన్ ను సీన్ టు సీన్.. ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేయడం తప్ప ప్రత్యేకంగా చేసిందేమీ లేదు.

Post Comment